SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chandrababu: గెలిచే అభ్యర్థులకు సీట్లు ఇస్తాం.. టీడీపీ నాయకత్వానికి చంద్రబాబు దిశానిర్దేశం

TDP Chief Chandrababu Naidu Guidelines To TDP Leaders About Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ నాయకత్వానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తామని.. వారినే గెలిపించాలని స్పష్టం చేశారు. బీసీలకు జనాభాలో సగం.. కూటమి ఇచ్చింది బలం అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 11, 2026, 06:17 PM IST | Updated: Oct 11, 2026, 06:20 PM IST
Image Credit: Source: Jai TDP Twitter
Join

Local Body Elections: 'డబుల్‌ ఇంజన్ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకావాలి. 2024 ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు పడాలి. ఇది నేతల పనితీరుకు కొలమానం. 50 రోజులు ఎవవరికీ మినహాయింపు లేదు గెలుపే ధ్యేయంగా పని చేయాలి' అని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. గెలుపు, నిజాయితీ, సమర్థత, సోషల్ రీ-ఇంజనీరింగ్ వంటి అంశాలను బేరీజు వేసుకునే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. సిన్సియార్టీ లేకుండా డ్రామాలాడేవారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు.. అలాంటి వారిని ఊపేక్షించమని హెచ్చరించార.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదివారం మంత్రులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, టీడీపీ ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వైఎస్సార్‌సీపీ చేసిన అన్యాయాన్ని వివరించారు.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని నాయకత్వానికి సూచించారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని... కలిసి ప్రచారం చేయాలంటూ నిర్దేశించారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోందనే విషయాన్ని గమనించాలని సూచించారు.

'స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై రేటింగ్స్ ఇస్తాం. సరిగా పని చేయాలని అందరిని కోరుతున్నా' అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని.. కూటమి బలం మరింత పెరగాలంటే స్థానిక ఎన్నికలే కీలకం అని గుర్తుచేశారు. ఈ ఎన్నికలతో గొడ్డలి పార్టీకి, అభివృద్ది నిరోధకులకు, రౌడీలకు, రప్పా రప్పా టీంలకు గట్టి బుద్ది చెప్పాలని సూచించారు. రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామని.. అంతే మొత్తంలో అభివృద్ది పనులు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.

'సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చెత్త పన్ను రద్దు చేశాం. భోగాపురం ఎయిర్‌పోర్టును పూర్తి చేశాం. వికేంద్రీకరణ విధానంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం పనులకు రూ.30 వేల కోట్లతో శంకుస్థాపన చేశాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 11,359 కోట్ల పనులను చేపట్టాం. భూ వివాదాలను పరిష్కరిస్తున్నాం. ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించాం. విశాఖ, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తిపై 60 వేల మందికి లబ్ది చేకూరేలా పూర్తి హక్కులతో పట్టాలిచ్చాం' అని వెల్లడించారు.

'సంక్షేమం అందించడంతోపాటు వ్యక్తిగత అవసరాలు తీరుస్తున్నాం.. సామాజిక అవసరాలు నెరవేరుస్తున్నాం. వ్యక్తి భద్రత, కుటుంబ సాధికారత, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని.. స్థానిక ఎన్నికలు జరగ్గకూడదని గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లింది. ఏపీలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు గొడ్డలి పార్టీ అన్యాయం చేయాలని భావించింది' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తెస్తే.. దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 34 శాతానికి పెంచామని గుర్తుచేశారు.

Add Zee News as a Preferred Source

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES