SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Woman jogging in France: ఫ్రాన్స్‌లో నిరసనల మంటలు.. రోడ్డుమీద మహిళ చేసిన పనికి అంతా షాక్.. వీడియో..

France protest row: ప్రాన్స్ అంతా నిరసనలతో అట్టుడికిపోతుంది. నిరసన కారులు రోడ్డుల మీదకు చేరుకుని వాహనాల రాక పోకల్ని అడ్డుకున్నారు. దీంతో పలు చోట్ల పోలీసులు రంగంలోకి దిగి నిరసన కారులను అదుపు చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 19, 2026, 03:55 PM IST | Updated: Oct 19, 2026, 04:03 PM IST
Image Credit: woman jogging in france video
Join

Woman jogging while protests in France Video viral: ఫ్రాన్స్ దేశంలో ఆందోలనలు మిన్నంటాయి. ముఖ్యంగా ఆదేశంలో నెలకొన్న విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయం, ఆర్థిక అసమానతలపై ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ చూసిన నిరసన కారులు రోడ్ల మీదకు వచ్చి శాంతి భద్రతలకు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే..ఫ్రాన్స్ లో అల్లర్ల వేళ రోడ్డుపై ఒక మహిళ జాగింగ్ చేస్తు వెళ్లింది.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

 

ఫ్రాన్స్ లో రోడ్డుపై నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు ఆందోళన కారులు పోలీసులు ఏర్పాటుచేసిన బారికెడ్లను పక్కకు తోసి మరీ రబ్బరు పైపులకు నిప్పులు పెట్టి నిరసనలు చేస్తున్నారు. పలు చోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో రోడ్డు మీద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంతలో ఒక మహిళ నిరసనల మధ్య జాగింగ్ చేస్తు కన్పించింది. ఆమె జాగింగ్ సూట్ వేసుకుని కూల్ గా అక్కడి నుంచి జాగింగ్ చేస్తు వెళ్లింది. అక్కడ ఉన్న గందర గోళంను ఏ మాత్రం పట్టించుకోలేదు. 

తనకేం అన్నట్లు కూల్ గా జాగింగ్ చేస్తు ఆ మహిళ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. గొడవల కన్న తన హెల్త్ ముఖ్యమంటూ అక్కడి నుంచి అందరికి ఆమె మెస్సెజ్ ఇచ్చినట్లు ఉందని కొంతమంది ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా ఆమెపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సదరు మహిళ పెట్టుబడి దారి విధానంతో కాదు.. ఆమె ఒంట్లోని కొవ్వుతో ఫైటింగ్ చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. 

హెల్త్ పట్ల ఆమెకున్న సీరియస్ నెస్ కు కొంత మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్ అల్లర్లపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైతం స్పందించారు. సరిహద్దులు క్లోజ్ చేసి అల్లర్లను కంట్రోల్ చేయాలని, వలస దారుల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయని తన సోషల్ మీడియాలో ప్లాన్ ఫామ్ ట్రూత్ వేదికగా సూచించారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES