SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళి రాత్రి పక్కింట్లో దొంగతనం చేస్తే అదృష్టం వస్తుందట.. హిమాచల్‌లో వింత ఆచారం!

Diwali Rare Tradition: దీపావళి పండగ రోజున హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అరుదైన సాంప్రదాయం పాటిస్తూ వస్తారు.. మారుమూల ప్రాంతాల్లో దీపావళి పండగ రోజున రాత్రిపూట ఇరుగుపొరుగు వారి పెరట్లో కూరగాయలతో పాటు ఇతర వస్తువులను దొంగతనం చేస్తూ ఉంటారట.. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని వారి నమ్మకమట..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 02:43 PM IST | Updated: Nov 08, 2026, 02:44 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Diwali Rare Tradition: సాధారణంగా దొంగతనం అనేది పెద్ద నేరంగా భావిస్తూ ఉంటారు. ఎవరైనా ఇంట్లో వస్తువులను దొంగలిస్తే గొడవలు జరగడంతో పాటు పోలీసు కేసులు నమోదు అవ్వడం సహజమని మనందరికీ తెలుసు.. కానీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భిన్న ఆచారాలు ఆధునిక ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. దీపావళి రాత్రి పక్కింట్లో లేదా ఎదురింట్లో చిన్న వస్తువును ఎత్తుకెళ్లితే అదృష్టం వస్తుందని.. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మే ఒక దశాబ్దాల నాటి సాంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ లోని కులుతోపాటు సిర్మోర్ లోయల్లో నేటికీ సజీవంగా కొనసాగుతూ వస్తోంది..

హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలతో పాటు ముఖ్యంగా కులు, సిర్మోర్ ప్రాంతాల్లో దీపావళి పండగ రోజు రాత్రి యువకులతో పాటు గ్రామస్తులు ఒక ఆసక్తికర ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు అర్ధరాత్రి సమయాల్లో ఇరుగుపొరుగు వారి తోటల్లోకి వెళ్లి కూరగాయలతో పాటు పండ్లు చెట్ల కొమ్మలు లేదా పెరట్లో ఉండే చిన్న చిన్న వస్తువులను ఎవరికీ తెలియకుండా రహస్యంగా తీసుకొస్తారు.. అయితే, ఇది ఎలాంటి నేరపూరిత ఉద్దేశంతో చేసే పని కాదని పూర్తిగా జానపద నమ్మకాలతో సరదాగా సాగే ఒక అద్భుతమైన సాంప్రదాయక వేడుక అని అక్కడి ప్రజలు చెబుతూ వస్తున్నారు.

ఈ ఆచారం వెనుక ఒక అద్భుతమైన జానపద నమ్మకం ఉందట.. పండగ రాత్రి పొరుగువారి నుంచి వస్తువులను సరదాగా చోరీ చేసిన వారికి రాబోయే ఏడాది మొత్తం అష్టైశ్వర్యాలతో పాటు సమృద్ధి లభిస్తాయని భావిస్తారు.. విచిత్రం ఏమిటంటే.. తమ తోటలో కూరగాయలతో పాటు పండ్లు, ఇతర వస్తువులు పోయిన విషయం తెలిసినప్పటికీ ఇంటి యజమానులు ఏమాత్రం కోపగించుకోరట.. పైగా తమ ఇంట్లో వస్తువులు పోయిందంటే.. ఇంటిపై ఉన్న దురదృష్టి తొలగిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని ఆ కుటుంబాలు సంతోష పడుతూ ఉంటాయట..

పండగ మరుసటి రోజు కూడా ఉదయం సరదాగా కూరగాయలు ఎత్తుకెళ్లిన వారు ఆ విషయాన్ని ఎవరి పెరట్లోనైతే కూరగాయలు ఎత్తుకెళ్తారో వారితో కూడా పంచుకుంటారట.. కొన్ని గ్రామాల్లో ఆ తెచ్చిన కూరగాయలతో పాటు సామూహికంగా వంట చేసుకుని అందరూ కలిసి భోజనం చేయడం విశేషం.. ఆధునిక కాలంలో గ్రామీణ సాంస్కృతి క్రమంగా మరుగున పడుతున్నప్పటికీ.. కొండ ప్రాంతాల ప్రజలు ఈ ఆచారాన్ని పక్కవారితో అనుబంధాన్ని.. ఆత్మీయతను పెంచి ఒక మాధ్యమంగానే చూస్తున్నారు.. నేరం కాదని అవి సాంస్కృతి.. సరదా విశ్వాసాలను నింపే పండగని అక్కడి ప్రజలు చెప్పుకొస్తున్నారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES