దీపావళి తర్వాత కుక్కలకు పూజలు.. వాటి మెడలో పూలదండలు, నుదుట తిలకం.. ఈ పండగ అసలు కథ ఇదే!
Kukur Tihar Festival: దీపావళి తర్వాత కొన్ని ప్రాంతాల్లో అరుదైన పండగలు జరుపుకుంటారు అందులో కుకుర్ తిహార్.. ఈ పండగ సిక్కిం తో పాటు డార్జిలింగ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పండగ రోజున అక్కడి ప్రజలు ఎక్కువగా కుక్కలను పూజిస్తూ ఉంటారట.. వీటిని పూజించటానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Dogs Worship During Diwali: సాధారణంగా దీపావళి అంటే దీపాల కాంతులతో పాటు లక్ష్మీదేవి పూజలే అందరికీ గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే, హిమాలయాలకు పరిసరాల్లో ఉండే ప్రాంతాల్లో మాత్రం ఈ పండగ వేల మూగజీవాల పట్ల అపారమైన ప్రేమను కృతజ్ఞతను చూపుతూ ప్రత్యేకంగా పండగను జరుపుకుంటూ ఉంటారు. నేపాల్‌తో పాటు భారతదేశంలోని సిక్కిం, డార్జిలింగ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి ఉత్సవాల్లో రెండవ రోజున కుకుర్ తిహార్ పండగను చాలా అద్భుతంగా జరుపుకుంటారు. ఈరోజు కుక్కలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అసలు ఈరోజు శునకాలని ఎందుకు పూజిస్తారు? దీపావళి రెండవ రోజే ఈ పండగ జరుపుకోవడానికి ప్రధాన కారణాలేంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పండగ రోజున కుక్కలకు ఎంతగానో మర్యాద చేస్తూ ఉంటారట.. పెంపుడు కుక్కలతో పాటు వీధుల్లో తిరిగే వాటికి ప్రేమగా పిలిచి స్నానాలు చేయిస్తారట.. వాటి మెడలో తాజా బంతిపూలతో అల్లిన దండలు వేసి నుదుట కుంకుమ తిలకం దిద్ది.. ఆశీస్సులు తీసుకుంటారట.. అంతేకాకుండా వాటికి ఈ సమయాల్లో ప్రత్యేకంగా పిండి వంటలు వండి భోజనంగా పెడుతూ ఉంటారట.. ఇక ఇదే సమయంలో మరి కొంతమంది పాలతో పాటు మాంసం, గుడ్లు ప్రత్యేకంగా చేసిన వంటలను తీపి పదార్థాలను విందుగా సమర్పిస్తూ ఉంటారట.. పోలీస్ శాఖ కూడా తాము పెంచే కుక్కలను అధికారికంగా పూజలు నిర్వహించి గౌరవిస్తుందట..
హిందూ పురాణాల ప్రకారం.. శునకాలను మృత్యుదేవుడైన యమధర్మరాజుకు నమ్మకమైన దూతగా భావిస్తూ ఉంటారట.. మహాభారతంలో పాండవులు స్వర్గారోహణ చేసే సమయంలో యమధర్మరాజు వెంటే నడిచి వచ్చిన ఏకైక జీవి శునకమేనని.. అందుకే శునకాలను పూజించడం వల్ల యమభయం తొలగిపోతుందని.. అవి మరణాంతరం ప్రయాణంలో మార్గదర్శనం చేస్తాయని భక్తుల విశ్వాసమట.. కాలభైరవుడి వాహనమైన శునకాన్ని పూజిస్తే గ్రహదోషాలతో పాటు భయాలు తొలగిపోతాయని అక్కడి ప్రజలు ఎంతగానో నమ్ముతూ ఉంటారట..
మనిషి పురోగతికి తోడుగా నిలిచే మూగజీవాలు.. ముఖ్యంగా తరాల తరబడిగా రక్షణ కల్పిస్తున్న జంతువులను గుర్తించి.. పూజించడమే తీహార్ వేడుకల ప్రధాన ఉద్దేశం.. ఐదు రోజులపాటు సాగే ఈ వేడుకల్లో కాకులతో పాటు గోవులు, ఎడ్లతోపాటు శునకాలకు ప్రత్యేక దినం కేటాయించడం ప్రకృతితో మమేకమైన మన సనాతన జీవన విధానానికి ప్రతీకాని అక్కడి ప్రజలు చెబుతూ వస్తున్నారు.. మూగజీవాలపై హింస పెరుగుతున్న నేటి కాలంలో వీధి కుక్కలను సైతం దైవంగా భావించి పూజించే కుక్కర్ తీహార్ మానవాళి కి జంతు సంరక్షణకు ఒక ప్రత్యేకమైన సందేహాన్ని అందిస్తోంది..