పీఎం కిసాన్ 24వ విడత.. అర్హులు ఎవరు? మీ పేరు ఉందా? మొబైల్‌లోనే ఇలా చెక్ చేసుకోండి!
రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సాగు ఖర్చుల నిమిత్తం, రిటైర్‌మెంట్ సమయంలో నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం కూడా రైతులకు అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ప్రస్తుతం 24వ విడత కోసం ప్రస్తుతం రైతులు ఎదురుచూస్తున్నారు. అసలు ఈ పథకానికి అర్హులు ఎవరు? జాబితాలో తమ పేరును ఎలా తనిఖీ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
PM Kisan 24th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక అద్భుతమైన పథకం. ప్రధానంగా రైతుల సంక్షేమం కోసం, వారి సాగు ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏడాది రూ. 6,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున మంజూరు చేస్తారు. ఇప్పటివరకు 23 విడతల్లో నిధులు విడుదలయ్యాయి. ప్రస్తుతం రైతులు 24వ విడత కోసం వేచి చూస్తున్నారు. ఈ నిధులు దసరా లేదా దీపావళి సమయంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నప్పటికీ, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా తేదీ ప్రకటించలేదు. గతంలో 23వ విడత నిధులు జూన్ 20న క్రెడిట్ అయ్యాయి. దీని ద్వారా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ విభాగం మొత్తం రూ. 18,800 కోట్లు 9.44 కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం, అర్హత కలిగిన భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ. 6,000 మొత్తాన్ని, మూడు విడతలుగా (ప్రతి విడత రూ. 2,000 చొప్పున) నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతం 24వ విడత నిధుల కోసం పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ అర్హతలు..
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదు. అలాగే, ఒక కుటుంబంలోని కేవలం ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉండాలి. రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు కూడా అర్హులు కారు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. కేవలం చిన్న రైతులు మాత్రమే దీని ద్వారా లబ్ధి పొందుతారు.
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే, రైతులు తమ కేవైసీ, ఆధార్ సీడింగ్, ల్యాండ్ రికార్డ్ వెరిఫికేషన్‌ను ముందుగానే పూర్తి చేసి ఉండాలి. కేవలం ఈ అర్హతలు కలిగిన రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేస్తారు.
Read Also: ఆధార్‌కు ఈమెయిల్ ఐడీని ఉచితంగా ఎలా లింక్ చేయాలి? డిసెంబర్ 31లోపు మొబైల్‌లోనే ఇలా చేసేయండి!
పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో మీ పేమెంట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ Pmkisan.gov.in ను ఓపెన్ చేసి, 'Know Your Status' పై క్లిక్ చేయాలి. అక్కడ మీ వివరాలను నమోదు చేస్తే, మీ పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది. బ్యాంక్ వివరాలు, UTR నంబర్, పేమెంట్ మోడ్, నిధులు క్రెడిట్ అయిన తేదీని కూడా మీరు క్షుణ్ణంగా చెక్ చేసుకోవచ్చు.