SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

10,000mAh బ్యాటరీతో Realme 17 Pro.. 144Hz AMOLED డిస్‌ప్లే, 65W ఫాస్ట్ ఛార్జింగ్‌, మరెన్నో!

Realme 17 Pro: త్వరలోనే మార్కెట్‌లోకి రియల్‌మీ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, అధికారిక ప్రకటనకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 17:50 IST | Updated: Nov 26, 2026, 17:52 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Realme 17 Pro: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ తన నంబర్ వనఖ సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే  రియల్‌మీ 17 ప్రో పేరుతో ఒక శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్ అధికారికంగా లాంచింగ్‌ కాకముందే.. దీనికి సంబంధించిన డిజైన్‌తో పాటు అనేక కీలక స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ భారీ బ్యాటరీతో పాటు అద్బుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లీకైన వివరాల ప్రకారం.. రియల్‌మీ 17 ప్రో డిజైన్‌లో కొన్ని అద్భుతమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో Square కెమెరా మాడ్యూల్ కూడా లభిస్తోంది. ఇందులో మూడు కెమెరా సెన్సార్లతో పాటు ఒక LED ఫ్లాష్‌ కూడా లభిస్తోంది.. ఈ కెమెరా సెటప్‌ కూడా కొన్ని ప్రముఖ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను పోలి ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా, వెనుక ప్యానెల్ మ్యాట్ ఫినిషింగ్‌తో పాటు ఫ్లాట్ ఫ్రేమ్‌తో ఎంతో ప్రీమియంగా కనిపిస్తోంది.. ముందు భాగంలో అత్యంత సన్నని బెజెల్స్‌తో పాటు మధ్యలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది..

10,000mAh భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీగా భావించవచ్చు.. రియల్‌మీ 17 ప్రో ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం.. గతంలో వచ్చిన రియల్‌మీ 16 ప్రో మోడల్‌లో 7,000mAh బ్యాటరీ ఉన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు దానిని ఏకంగా 10,000mAhకు పెంచడం విశేషం.. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం కూడా లభిస్తోంది..

గేమింగ్‌తో పాటు మల్టీమీడియా కోసం ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. స్క్రీన్ సైజు వివరాలు అందుబాటులోకి రాలేదు.. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.  రియల్‌మీ 16 ప్రోలో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండగా.. ఈ కొత్త 17 ప్రో మోడల్‌లో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. యల్‌మీ సంస్థ తన 17 ప్రో విడుదల తేదీని గానీ, అధికారిక ఫీచర్లను గానీ ఇంకా ప్రకటించలేదు. కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటను చేసే అవకాశాలు ఉన్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES