SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Devi Navratri Utsav: దేవీ నవరాత్రి రోజుల్లో ఏ రోజు అమ్మవారికి ఏయే నైవేద్యం

These Prasad Items To Navratri Utsav 9 Days 9 Prasad: దసరా పండుగ సందడి మొదలైంది. దసరా పండుగకు ముందు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. 9 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తుంటారు. అయితే ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం అందించాలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 10, 2026, 07:13 PM IST | Updated: Oct 10, 2026, 07:39 PM IST
Image Credit: Devi Navratri Utsav 2026
Join

Navratri Utsav Prasad: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో దసరా సందడి ప్రారంభమైంది. పెత్తర అమావాస్యకు బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభమవగా.. రేపటి నుంచి అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరగనున్న దేవీ నవరాత్రి ఉత్సవాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో.. నిష్టతో కొలుస్తారు. వినాయక చవితి ఉత్సవాల తర్వాత అంతటి భారీ స్థాయిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేయగా.. అమ్మవారిని అత్యంత నిష్టతో పూజించనున్నారు.

నవరాత్రులు 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి రోజుకో నైవేద్యం సమర్పిస్తుంటారు. దుర్గా భవానీకి నివేదించే ప్రసాదాల్లో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా సాత్త్వికం, రాజసం, తామసం అని మూడురకాలుగా చెబుతారు. అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు వివిధ రకాలైన పదార్థాలను ప్రసాదంగా నివేదన చేయనున్నారు. ఈ ప్రసాదాలు అత్యంత నిష్టతో.. భక్తి ప్రపత్తులతో చేయాల్సి ఉంది. మరి ఏ రోజు ఏయే నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారో తెలుసుకుందాం. అమ్మవారి రూపంతోపాటు ఆ రోజు దేవీకి సమర్పించే ప్రసాదం వివరాలు ఇలా ఉన్నాయి.

తొలి రోజు : నెయ్యి, కట్టు పొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం
బాల త్రిపురసుందరి: పంచదార కలిపిన నెయ్యి, పులిహోర, వడపప్పు
గాయత్రి దేవీ: పంచదార, కొబ్బరి అన్నం, రవ్వకేసరి
లలిత: అరటిపళ్లు, రవ్వకేసరి, పులిహోర, పెసర బూరెలు
సరస్వతి: బెల్లం కలిపిన అన్నం గారెలు, నిమ్మరసం
అన్నపూర్ణ దేవి: పాలు, అల్లం గారెలు, పొంగలి నైవేద్యం
మహాలక్ష్మి: తేనె- కదంబం, అటుకులు, బెల్లం, కొబ్బరి
మహిషా సురమర్దిని: పేలాలు, పెరుగన్నం, గారెలు, పులిహోర
దుర్గాదేవి: కొబ్బరికాయ, పరమాన్నం, చక్కెర పొంగలి
రాజరాజేశ్వరి: పెరుగు, షడ్రసోపేతమైన భోజనం, లడ్డూలు- పంచభక్ష్యాలు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES