SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Diwali 2026: దీపావళి ఎందుకు వెలుగుల పండుగ? చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఇదే!

Diwali 2026 Special: Know The Diwali Devotional Story Why Celebrates With Lights: దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. భారతదేశమంతా దీపాల వెలుగులతో కాంతులీనుతుంది. దీపావళి అంటే దీపాలను వెలిగించడమే. అయితే దీపావళి రోజు ఎందుకు దీపాలు వెలిగించడం.. వెలుగుల పండుగ అని చెప్పేందుకు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 08:13 PM IST | Updated: Nov 06, 2026, 08:46 PM IST
Image Credit: Diwali 2026
Join

Diwali Devotional Story: నిండు అమావాస్య రోజు పండుగ వస్తుంది. చిమ్మ చీకట్లు అలుముకునే ఆ రోజు ప్రజలందరూ దీపాలు వెలిగించి నిండు పున్నమిగా మారుస్తారు. అదే దీపావళి పండుగ. ఆ రోజు దీపకాంతులతో అందరి వాకిళ్లు.. ముంగిళ్లు వెలుగుతాయి. వెలుగు జిలుగుల మధ్య హిందూ ప్రజలు పండుగ చేసుకుంటుంటారు. నవంబర్‌ 8వ తేదీ ఆదివారం దీపావళి పండుగ రానేవచ్చింది. మరి ఈ దీపావళి పండుగ ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఈరోజు దీపాలు వెలిగిస్తారు? అనేవి తెలుసుకుందాం.

దీపాల సమూహానికి ఉన్న ప్రాధాన్యమే దీపావళి పండుగ అని భావించవచ్చు. దీపావళి విశిష్టతను మూడు శ్లోకాలు, మంత్రాలు వివరిస్తున్నాయి.

'దీపం జ్యోతిః నమస్తుభ్యం
దీపం జ్యోతిః నమోస్తుతే' అనే మంత్రం దీపం పవిత్రతను, మహిమను తెలియజేస్తుంది.

శ్లోకం:
భ్రం కరోతి కల్యాణమ్, ఆరోగ్య ధన సంపదామ్।
శత్రువృద్ధి వినాశాయ, దీపం జ్యోతిః నమోస్తుతే॥

'అగ్ని జ్యోతిః రవి జ్యోతిః చంద్ర జ్యోతిస్తథైవ చ।
ఉత్తమ సర్వజ్యోతిషాం ప్రతిగృహ్యతామ్॥' అనే మంత్రం పఠించాలి.

ఈ మంత్రం అగ్ని కాంతి, సూర్యుడి కాంతి, చంద్రుడి కాంతి ఇవన్నీ జ్యోతులే అని చెబుతుంది. 'ఈ సమస్త జ్యోతులలోకెల్లా శ్రేష్ఠమైన జ్యోతి నేను సమర్పించే దీపం.. దయచేసి దీనిని స్వీకరించండి' అని విజ్ఞాపన చేయడం ఈ మంత్రం అర్థం. దీపం అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపానికి ప్రతీక. మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తూ.. శరీరంలోనూ మనస్సులోనూ చీకటిని పారదోలి వెలుగుల మార్గంలో నడిపించాలనే భావనే దీపావళి పండుగలోని అత్యున్నత సందేశం.

పురాణ కథనాల ప్రకారం దీపావళి కథనం ఇలా ఉంది. అయోధ్యను వదిలి వనవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు తన భార్య సీతను రావణాసురుడు అపహరించాడు. రావణుడిని యుద్ధంలో సంహరించి.. లంకను దహనం చేసి సీతాదేవిని రక్షిస్తాడు. అనంతరం రాముడు, సీతాదేవిని తీసుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్బంగా అయోధ్య ప్రజలందరూ దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. ఆయన రాకను పురస్కరించుకుని అయోధ్య నగరమంతా దీపాల వరుసలతో అలంకరించడంతో నాటి నుంచి దీపావళిని చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రతి ఇంటిలోనూ మంగళదీపాలు వెలిగించడం చేస్తున్నారు.

దీపావళి
చీకటి నుంచి వెలుగుల వైపు నడిపించే పర్వదినంగా దీపావళిని భావిస్తారు. చీకటి నుంచి వెలుగుల వైపు మనిషిని నడిపించే మహోన్నతమైన పర్వదినమే దీపావళి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను విద్యుద్దీపాల అలంకరణతో అందంగా తీర్చిదిద్ది ఇంటి నిండా దీపాలను వెలిగిస్తారు. దీపం అనేది కేవలం వెలుగును ప్రసాదించడమే కాకుండా అజ్ఞానమనే చీకటిని తొలగించి.. జ్ఞానమనే వెలుగును పంచుతుంది. దీప ప్రజ్వలన ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోయి.. సానుకూలమైన ఆధ్యాత్మిక శక్తి ప్రసరిస్తుందని హిందూ ధర్మం చెబుతోంది.

దీపావళి రోజు ఏం చేస్తారు..
దీపావళి రోజు అందరూ ఉదయాన్నే స్నానం ఆచరించి.. ఇంట్లో దేవుడి పూజ చేసుకుంటారు. అనంతరం పిండి వంటలు వండుకుని దేవుడికి ప్రసాదంగా పెడతారు ఆ తర్వాత కుటుంబసభ్యులంతా ఆనందోత్సాహాలతో సహపంక్తి భోజనం చేస్తారు. ఇక సాయంత్రం పూట ఇంటి ముంగట దీపాలను వెలిగించి.. దైవరాధన చేస్తారు.

వ్యాపారుల పూజలు
దీపావళి రోజున వ్యాపారులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. దీపావళి సందర్భంగా లక్ష్మీపూజ చేస్తారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో పూజ చేసి నిర్వహిస్తారు. అనంతరం తాంబూలం, ప్రసాదాలు, కొందరు భోజనాలు కూడా పెడుతుంటారు. ఇక అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు, ధనధాన్యాలు, వైభవం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలను నింపాలని 'జీ తెలుగు న్యూస్‌' కోరుకుంటోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES