దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!
Diwali Gambling Tradition: దీపావళి పండగ రోజును కొన్ని ప్రాంతాల్లో జూదం విపరీతంగా ఆడుతూ ఉంటారు. అయితే, దీనికి కైలాసంలో ఉన్న పార్వతీదేవికి కనెక్ట్‌గా ఉన్న కథేంటి? అసలు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు మాత్రమే జూదం ఆడడానికి గల కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Diwali Gambling Tradition Telugu: దీపావళి పండగ అంటేనే దీపాలతో పాటు మిఠాయిలు, లక్ష్మీదేవి పూజ గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒక్క రాత్రిలోనే కోట్ల రూపాయలు చేతులు మారే పేకాట క్లబ్బులతో పాటు గ్యాంబ్‌లింగ్ ఆటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ పవిత్రమైన పండగ రోజున సాక్షాత్తూ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే నమ్మకంతో చాలా మంది ఈ రోజు జూదాలతో పాటు పేకాట ఆడటం ఆనవాయితీగా వస్తోందట.. ఇంటకీ సంపదలను ప్రసాదించే లక్ష్మదేవికి జూదానికి సంబంధం ఏమిటి? ఈ సంప్రదాయవ వెనుక ఉన్న అసలైన కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్కంద పురాణం ప్రకారం.. కార్తీక అమావాస్య దీపావళి రాత్రి కైలాసంలో పార్వతీదేవితో పాటు పరమేశ్వరుల మధ్య పాచికల ఆట జరిగిందట.. వినోదంగా ప్రారంభమైన ఈ ఆటలో జగన్మాతగా భావించే పార్వతీదేవి పరమేశ్వరుడిపై ఘన విజయం సాధించిందట.. ఆ విజయంతో పార్వతీదేవి దీపావళి రాత్రి ఎవరైతే పాచికలు లేదా అదృష్టాన్ని పరీక్షించే ఈ ఆటలు ఆడుతారో, వారు రాబోయే ఏడాది మొత్తం సుఖసంతోషాలతో పాటు శ్రేయస్సును పొందుతారని.. ఒక సరదా వరం ఇచ్చినట్లు పురాణ ప్రస్తావనలు ఉన్నాయి. దీనినే ఉత్తర భారతదేశంలో ద్యూత ప్రతిపదగా కూడా పిలుస్తూ ఉంటారు.
పురాణాల్లో ఉన్న ఆ సరదా క్రీడ క్రమంగా కాలక్రమేణా పేకాటగా.. ఆధునిక బెట్టింగ్‌తో పాటు జూదంగా రూపాంతరం చెందుతూ వచ్చింది.. ఈ రాత్రి కొద్దిపాటి వినోదం కోసం.. ఆడితే ధనలక్ష్మి కటాక్షిస్తుందని భావించిన జనం.. ప్రస్తుతం దీన్ని పెద్ద ఎత్తున పందాలు కాసే స్థాయికి వచ్చారు.. ఒకప్పుడు కేవలం కుటుంబ సభ్యుల మధ్య సరదాగా సాగిన పాచికలాట.. ఇప్పుడు రాత్రికి రాత్రే లక్షలు, కోట్లు చేతులు మారే ప్రమాదకర వ్యాపారంగా మారుతూ వచ్చింది..
పండుగ రాత్రి సరదా వినోదం సంగతి ఎలా ఉన్నా.. హిందూ ధర్మశాస్త్రాలు జూదాన్ని ఎప్పుడూ ఒక పాపకార్యంగానే పరిగణిస్తూ వస్తాయి.. శ్రీమద్భాగవతంలో పరీక్షిత్తు మహారాజు కలిపురుషుడికి నివాస స్థానాలు అందించినప్పుడు.. మద్యం, వ్యభిచారం, హింసతో పాటు జూదం ఉన్నచోటే కలిపురుషుడు స్థిరపడతాడని తెలిపారు. మహాభారతంలో ధర్మరాజు జూదం కారణంగా సమస్త రాజ్యాన్ని.. గౌరవాన్ని పోగొట్టుకున్న ఘటన కూడా ఇప్పటికీ అందరికీ తెలుసు.
గమనిక: దీపావళి అనేది చీకటిని తరిమి వెలుగులను నింపే పవిత్రమైన రోజు.. పార్వతీ, పరమేశ్వరులు వినోదాన్ని తప్పుగా అర్థం చేసుకుని.. సర్వస్వం కోల్పోయే వ్యసనంగా మార్చుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పెద్దలు, పండితులు తెలుపుతున్నారు.