SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపించిందా? లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతున్నట్టేనా?

Diwali Owl Sighting: దీపావళి రోజున గుడ్లగూబను చూడడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అయితే, వీటిని సాక్షాత్తు లక్ష్మీదేవి భావిస్తారు. ఈ రోజు వాటిని చూడడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే చాలా మంది ఈ సమయంలో వీటిని కూడా పూజిస్తారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 07, 2026, 02:08 PM IST | Updated: Nov 07, 2026, 02:09 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Diwali Owl Sighting: చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగకు సంబంధించిన అనేక ఆచారాలతో పాటు విశ్వాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి అమావాస్య రాత్రి సమయంలో లక్ష్మీ పూజ జరుగుతున్న సమయంలో ఎవరికైనా గుడ్లగూబ కనిపిస్తే.. దానిని అపారమైన ధనలాభానికి.. శుభసమయానికి సంకేతంగా భావిస్తూ ఉంటారట. సాధారణ రోజుల్లో కీడు పక్షిగా భావించే గుడ్లగూబను ఆ ఒక్క రాత్రి చూడటం ఎందుకు మంచిది? అసలు ఇలా చూస్తే ఏం జరుగుతుంది? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం.. గుడ్లగూబను సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి వాహనంగా భావిస్తూ ఉంటారు. దీనిని సంస్కృతంలో ఉలూకం అని కూడా అంటారట.. దీపావళి రాత్రి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందని.. ఆ సమయంలో ఆమె వాహనమైన గుడ్లగూబ కనిపించడం అంటే ఆ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రవేశించినట్లేనని కొంతమంది ఆధ్యాత్మిక నిపుణులు తెలుపుతున్నారు. చీకటిలో కూడా స్పష్టంగా చూడగలిగే.. విలక్షణమైన దృష్టి గుడ్లగూబ సొంతం.. ఇది అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని.. నిరంతర అప్రమత్తతను సూచిస్తుందని పండితులు చెబుతుంటారు. సంపదను కాపాడుకోవడానికి వివేకం, ఏకాగ్రత ఎంత అవసరమో ఇది గుర్తుచేస్తుందని భావిస్తారు..

ఆధ్యాత్మికంగానే కాకుండా.. దీని వెనుక పర్యావరణ, వ్యవసాయ కోణం కూడా బలంగా ముడిపడి ఉందని నిపుణులు తెలిపారు. శరదృతువు ముగిసి కొత్త పంటలు చేతికి వచ్చే దీపావళి సమయంలో ధాన్యపు రాసులు, పొలాల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది.. గుడ్లగూబలు రాత్రి సమయాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలు, పురుగులను వేటాడి తింటూ ఉంటాయి. అందుకే వీటిని రైతు నేస్తాలుగా చెబుతూ ఉంటారు. పొలాల్లో, నివాస ప్రాంతాల్లో గుడ్లగూబల సంచారం ఉంటే ధాన్యం సురక్షితంగా ఉంటుందని.. రైతులకు ఆర్థిక నష్టం కలగకుండా సిరిసంపదలు నిలుస్తాయనేది సమాచారం. ఈ కారణంతోనే పురాణాల్లో వీటికి అద్భుతమైన స్థానాన్ని కల్పించారు.

కొన్ని ప్రాంతాల్లో దీపావళి వేళ తాంత్రిక పూజల పేరుతో గుడ్లగూబలను బలి ఇవ్వడం లేదా పంజరాల్లో బంధించడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది తీవ్రమైన చట్టరీత్యా నేరమని.. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. తప్పకుండా శిక్షపడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. గుడ్లగూబను కేవలం చూడటం శుభంగా భావించాలే తప్ప.. వాటిని హింసించడం వల్ల శాంతి, శ్రేయస్సు లభించవని పండితులు కూడా తెలుపుతున్నారు.. ప్రకృతి సమతుల్యతను కాపాడే ఈ జీవులను సంరక్షించుకోవడమే నిజమైన దీపావళి..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES