SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గురుగ్రహం తిరోగమనం.. ఏప్రిల్ 13 వరకు ఈ 3 రాశులకు అదృష్టం కలిసొస్తుందా?

Jupiter Retrograde Horoscope: ఏప్రిల్ 13వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుందట.. ముఖ్యంగా గురుగ్రహం తిరోగమనంతో కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి. అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు లభించడమే.. కాకుండా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 20, 2026, 08:57 AM IST | Updated: Oct 20, 2026, 08:59 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Jupiter Retrograde 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహాన్ని జ్ఞానంతో పాటు అదృష్టం ధనం విద్య వివాహం పురోగతికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే గురు గ్రహం ప్రతి సంవత్సరంలో రాశి సంచారంతో పాటు తిరోగమనం తప్పకుండా చేస్తూ ఉంటుంది. దీనివల్ల 12 రాశులు ప్రభావితం అవుతూ ఉంటాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో గురుగ్రహం సింహరాశిలో వక్రదశలోకి వెళ్ళిపోతోంది. ఏప్రిల్ 13వ తేదీ వరకు ఇదే రాశులు వక్రగతిలో ఉండబోతూ ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశుల వారు విశేషమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.. ఏ రాశుల వారికి ఎక్కువగా లాభాలు కలుగుతాయి? అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.

గురు గ్రహ తిరోగమనంతో ఈ రాశుల వారికి జాక్పాట్..
సింహరాశి 
గురుగ్రహం తిరోగమనం చేయడం కారణంగా వీరి వృత్తి జీవితం పై సానుకూలమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగంలో గతంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది.. అలాగే పదోన్నతులు లభించి కొత్త బాధ్యతలు కూడా సులభంగా పొందగలుగుతారు. వ్యాపారవేత్తలకు కూడా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందగలుగుతారు.. పాత పరిచయాలతో కొత్త ప్లానింగ్ తో ముందుకెళ్లి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కొంత ఆలోచించడం మంచిది.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థిక రంగంలో విశేషమైన లాభాలు కలుగుతాయని.. ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే వీరికి పనుల్లో ఎక్స్పీరియన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది.. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు నియంత్రణలోకి రావడం వల్ల కాస్త పొదుపు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. పెద్ద పెట్టుబడిలో నిర్ణయాలు తీసుకునే వారు తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది..

మేషరాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఉద్యోగాలతో పాటు వ్యాపారపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వీరికి వ్యాపారాలపరంగా పాత కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు బలోపేతం అప్పడమే కాకుండా అనవసరమైన ఖర్చులు కూడా సులభంగా తగ్గుతూ వస్తాయి. భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికలు వేసుకోవడం వల్ల దిమ్మతిరిగే ధను లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ఖర్చులు కూడా ఊహించని స్థాయిలో తగ్గుతూ వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

గమనిక..


 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES