ఈ 5 రాశులకు మహర్దశ, బిగ్ జాక్‌పాట్.. లక్ష్మీనారాయణ, గజకేసరి రాజయోగాలు!
October 20 Horoscope: అక్టోబర్ 19వ తేదీ రోజున ఏర్పడిన శక్తివంతమైన యోగాలతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా చాలా వరకు కలిసి రావడమే కాకుండా.. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరబోతున్నాయి.. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి..
October 20 Horoscope Telugu News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ లోని 19వ తేదీ ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే నవరాత్రుల్లో ఈరోజు మహా అష్టమిగా చెప్పుకుంటారు. అయితే ఈరోజే అనేకరకాల శుభయోగాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రవియోగంతో పాటు స్వార్థ సిద్ధి యోగం వంటి శుభ సంయోగాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ రోజే సూర్యుడితో పాటు శుక్రుడు, బుధుడు తులారాశిలో సంయోగం చేశాయి. దీనివల్లే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో పాటు బుధాదిత్య రాజయోగం శుక్రాతిద్య రాజయోగం వంటి శక్తివంతమైన గ్రహయోగాలు ఏర్పడ్డాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో చంద్రుడితోపాటు గురు గ్రహం సంయోగం కారణంగా ఎంతో శక్తివంతమైన గజకేసరి రాజయోగం కూడా ఏర్పడింది. దీనివల్ల ఈ సమయం ఎంతో శుభప్రదంగా మారిపోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా ఈ యోగాల ప్రభావం విజయదశమి ఆ మరుసటి రోజు వరకు కూడా కొనసాగుతుంది. అంటే దాదాపు అక్టోబర్ 21వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఎంతో శక్తివంతమైన రాజయోగాల కారణంగా ఉద్యోగాలపరంగా చాలావరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి.. పనుల్లో అంకితభావంతో కష్టపడి చేసే వారికి డబ్బులు కూడా భారీగా లభించబోతోంది. వ్యాపారవేత్తలకు ఆర్థిక పురోగతి కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కోర్టు సంబంధిత విషయాల పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.. ప్రయాణం చేయడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తాయి.
కర్కాటక రాశి
విజయదశమి ఆ మరసటి రోజు వరకు కర్కాటక రాశి వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆకారంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి అద్భుతమైన పురోగతి లభించి పనుల్లో అనుకుంటున్నవి అన్ని చేసి విజయాలు సాధించగలుగుతారు. అలాగే పై అధికారుల నుంచి సపోర్ట్ లభించి విశేషమైన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో ప్రయాణాలు చేయడం లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కెరీర్ ఎంతో బాగుంటుంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ మోస్ట్ పవర్ఫుల్ రాజయోగాలతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా మారబోతోంది. ముఖ్యంగా రోజువారి ఆదాయ వనరులు కూడా భారీగా పెరుగుతాయి. పిల్లలనుంచి కూడా అనేక శుభవార్తలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా సౌకర్యాలు విపరీతంగా పెరుగుతాయి.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఉద్యోగాల పరంగా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పై అధికారుల నుంచి సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అలాగే వీరికి వ్యాపారాల పరంగా కూడా ఎంతో కలిసి రాబోతోందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ఏదైనా పనులు మొదలుపెట్టేముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేసే వారికి భూతమైన లాభాలు కలుగుతాయి. కుటుంబ సౌకర్యంతో పాటు విలాసం విపరీతంగా పెరుగుతుంది.
మీన రాశి
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలపరంగా ఎన్నో రకాలైన ఆపాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అధికారుల నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా రోజువారి ఆధార వనరులు కూడా పొందగలుగుతారు. విలాసవంతమైన వస్తువులను విక్రయించే అవకాశాలున్నాయి. డబ్బు సంపాదించడానికి ఇది మంచి సమయంగా మారుతుంది..
గమనిక..