Lord Ganesh Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వినాయక మండపంలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం చేతిలో ఉన్న లడ్డును ఎలుక చేతి పైకి ఎక్కి మరీ తింటున్న వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. లంబోదరుడికి వాహనంగా భావించే ఎలుక ఆ లడ్డును తినడం చూసి.. భక్తులంతా ఇది ఆ స్వామి మాయే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్గా మారింది.