SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

16 ఏళ్ల శరణ్య ఖేరుకా అద్భుత ఘనత.. పారాలింపియన్ల జీవితాలపై రాసిన పుస్తకానికి ప్రశంసలు!

Sharanya Kheruka Book: శరణ్య ఖేరుకా పారా అథ్లెట్లపై రాసిన పుస్తకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ బుక్‌ను భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడి నుంచి మంచి ప్రశంసలు లభించాయి. అయితే, ఈ బుక్‌లో ఉన్న అంశాలేంటో? అసలు దీనికి ఎందుకు ఇంత గుర్తింపు వచ్చిందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 05:28 PM IST | Updated: Oct 16, 2026, 05:29 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Sharanya Kheruka Book: అత్యంత చిన్న వయసులోనే 16 ఏళ్ల ముంబై టీనేజర్ శరణ్య ఖేరుకా విశేష గుర్తింపు సాధించారు. మహారాష్ట్రకు చెందిన పారా అథ్లెట్ల అద్భుతమైన జీవిత ప్రయాణంతో పాటు విజయాల వెనక ఉన్న ఎన్నో సమస్యలపై ఆమె రచించిన  లివింగ్ హిస్టరీస్.. స్టోరీస్ ఆఫ్ మహారాష్ట్రాస్ పారాలింపియన్స పుస్తకానికి భారత పారాలింపిక్ కమిటీ (PCI) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా నుంచి అద్భుతమైన ప్రసంసలు లభించాయి.. PCI డైరెక్టర్ సత్యనారాయణతో పాటు పారా అథ్లెట్లు సుకాంత్ కదమ్‌తో పాటు సందీప్ సంజయ్ సర్గార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తకంపై ప్రశంసలు కురిపించారు.

ఒక్కో పతకం వెనుక కఠినమైన ప్రయాణం దాగి ఉంటుందని ఈ పుస్తకంలో రచయిత పేర్కొంది. ఎన్నో ఓటములతో పాటు అనేక రకాల కఠినమైన నిర్ణయాలు.. విశ్రాంతి లేకుండా తీసుకున్న శిక్షణ, అనేక అనుమానాలు, వాటన్నింటినీ అధిగమించి.. మళ్లీ ప్రయత్నించే ధైర్యం గురించి.. శరణ్య కళ్లకు కట్టిన్నట్లు రాసుకొచ్చారు.. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ఎన్నో పతకాలు తెచ్చిపెట్టినప్పటికీ.. చాలామంది పారా-అథ్లెట్ల సక్సెస్‌తో పాటు వారు ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యలు సమాజానికి ఇంకా తెలియకపోవడం ఆశ్చర్యకలిగిస్తోందని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా శరణ్య ఖేరుకా మాట్లాడుతూ.. క్రీడలు తన జీవితంలో ఎప్పుడూ.. ఒక ముఖ్యమైన భాగంగా ఉండేవని.. అయితే, తనకు తగిలిన ఒక గాయం ఓటములను చూసిందని.. ఈ పారాలింపియన్లతో మాట్లాడి వారి కథలు విన్నప్పుడు.. వారు ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ.. లక్ష్యాలను సాధించడానికి ధైర్యాన్ని అందించాయని అన్నారు. ఎందరో అథ్లెట్లు దేశానికి పతకాలు తెచ్చినప్పటికీ.. వారి గురించి చాలా కొద్దిమందికే తెలుసని.. ఈ పరిస్థితులను మార్చడానికే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దృఢ సంకల్పంతో కలలను సాకారం చేసుకోవచ్చని.. తెలియజేయడానికే ఈ పుస్తకం రాశారని తెలిపారు.

అంతేకాకుండా సుకాంత్ కదమ్‌తో పాటు సందీప్ సంజయ్ సర్గార్ వంటి పారా అథ్లెట్లు అవకాశాలు రాక.. అనేక ఇబ్బందులను ఎదుర్కొని.. చివరకు పారా క్రీడల్లో అడుగుపెట్టి.. అంతర్జాతీయ స్థాయికి చేరిన విధానాన్ని ఈ పుస్తకం వివరించారని వెల్లడించారు. కేవలం పతకాలు, పోడియం ఫినిషింగ్‌లకే పరిమితం కాకుండా.. అక్కడిదాక ఎదడానికి వారు ఎదుర్కొన్న సమస్యలను యువతరం గుర్తించుకునేలా చేయడమే తన ఆశయమని శరణ్య తెలిపారు..  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES