SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Eatala Rajender: 'చెత్త' కోసం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర

Eatala Rajender Padayatra For Polluted Jawahar Nagar Dump Yard: తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గంలోని కీలక సమస్యపై పోరాటం ప్రారంభించారు. అత్యంత సమస్యగా మారిన జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ యార్డు పరిష్కారం కోసం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 21, 2026, 05:11 PM IST | Updated: Oct 21, 2026, 05:20 PM IST
Image Credit: Eatala Rajender Padayatra
Join

Eatala Rajender Padayatra: హైదరాబాద్‌లో అత్యంత సమస్యగా మారిన జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ యార్డు పరిష్కారం కోసం బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గంలో అతి పెద్ద సమస్యగా ఉన్న డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారం కోసం పాదయాత్ర చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌ నిర్ణయించారు. జవహర్‌నగర్ డంప్ యార్డు తరలించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కార్యక్రమం చేపట్టబోతున్నారు.

మీథేన్ గ్యాస్ విడుదల చేయడంలో ప్రపంచ రికార్డు(చెత్త రికార్డు) సాధించిన జవహర్ నగర్ డంప్ యార్డు. ప్రపంచంలో నాలుగవ స్థానంలో నిలిచింది. అయితే మీథేన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఈటల రాజేందర్‌ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఈటల రాజేందర్‌ పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. చెత్త నిర్వహణపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం వినియోగించడం లేదని ఎంపీ ఈటల ఆరోపించారు. డంప్‌యార్డుకి వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన జవహర్‌నగర్ బాధితులతో జవహర్‌నగర్‌లో సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 25వ తేదీన మేధావులు, పర్యావరణవేత్తలతో డంప్‌యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని.. తర్వాత 27వ తేదీ నుంచి డంప్‌యార్డుకి వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌ నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 'జవహర్‌నగర్ డంప్‌యార్డు రెండు లక్షల జనాభా కోసం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు కోటి 60 లక్షల మందికి చెందిన చెత్త ఇక్కడికి వస్తుంది. చుట్టూ 25 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు విషపు గాలులతో ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు వస్తున్నాయి' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'కూరగాయలు అమ్ముకొని, ఇళ్లల్లో పని చేసుకుని కడు పేదరికంలో ఉన్నవారు సంపాదించుకునే ప్రతి పైసా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. జనావాసాలకు దూరంగా డంపింగ్ తరలించాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తుంది' అని వివరించారు.

సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత కూడా చెత్తతో ఇన్ని సమస్యలు ఎదుర్కొనే దుర్మార్గమైన పరిస్థితికి చరమగీతం పాడాలని ఎంపీ ఈటల రాజేందర్‌ కోరారు. ఐఐటీ బాంబే ప్రతినిధులు ఇలాంటి చెత్త డంపు యార్డుల నిర్వహణ కోసం టెక్నాలజీ కూడా అందించారని.. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగల్భాలు పక్కనపెట్టి ఈ సమస్య నుంచి ఇక్కడి ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించాలని ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్ చేశారు.

'అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా దీనిమీద రీసెర్చ్ చేశారు. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద డంపింగ్ యార్డ్‌. ఎక్కువ విష పదార్థాలను విడుదల చేస్తున్న డప్పు యార్డ్ ఇది. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇక్కడ నివసించే ప్రజలకు ఎక్కువ సమస్యలు వస్తాయి' అని ఎంపీ ఈటల రాజేందర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జీరో పొల్యూషన్ దిశగా అడుగులు వేయాలని.. నాలుగు దిక్కులా చెత్తను పంపించి ఇక్కడకు రాకుండా చూడాలని ఎంపీ ఈటల విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES