దసరా వేళ మటన్ ధరలు షాక్.. కిలో రూ.1,200 వరకు.. చికెన్ రేట్లు ఎంతంటే?
Dasara 2026 Meat Prices: దసరా సందర్భంగా నాన్ వెజ్ ప్రియులకు మటన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. కొన్నిచోట్ల మటన్ ధరలు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగరాల్లో కేజీ మటన్ ధర రూ.1,100 నుంచి రూ.1,200 వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే, చికెన్ మాత్రం గతంలో ఉన్న ధరలోనే కొనసాగుతూ వస్తుంది.
Dasara 2026 Meat Prices: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో మాంసం మార్కెట్లో కిటకిటలాడుతూ వస్తున్నా. దసరా పండగ ప్రత్యేక సందర్భంగా మంగళవారం తెల్లవారి జాము నుంచే మాంసం దుకాణాల వద్ద వినియోగదారులు బారులు తేలినట్లు తెలుస్తోంది. మార్కెట్లోని డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ చికెన్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండగా.. మటన్ ధరలు మాత్రం భారీ స్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది.. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు చికెన్ మటన్ ధరలు ఎలా ఉన్నాయి? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గత వారంతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలలో ఎలాంటి పెరుగుదల లేదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.270 నుంచి రూ.300 మధ్య పలుకుతోంది. ఇక తెలంగాణలోని కీలక నగరాలైన వరంగల్ తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ ఆదిలాబాద్ లలో కిలో చికెన్ ధర రూ.280 వరకు వ్యాపారులు విక్రయిస్తూ వస్తున్నారు. చికెన్ రేటు దాదా నిలకడగా ఉన్నప్పటికీ.. మార్కెట్కు కోళ్ల సరఫరా డిమాండ్ తగ్గినట్లు ఉండడం వల్లే పండుగ సీజన్లో ధరలు స్థిరంగా ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతూ వస్తున్నాయి..
మరోవైపు మటన్ ప్రియులకు మాత్రం ఖర్చులు తడిసి మోపెడుతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ప్రాంతాన్ని బట్టి కిలో మటన్ ధర రూ. 700 నుంచి రూ.1200 వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. పట్టణాలతో పాటు నగర ప్రాంతాల్లోని ప్రముఖ కేంద్రాల్లో కిలో ధర గరిష్టంగా రూ.1,000 నుంచి రూ.1,100 ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కేవలం రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మేకల, గొర్రెల కొనుగోలు ఖర్చులతో పాటు ట్రాన్స్పోర్ట్ వ్యాయామం పెరగడమే ఎందుకు కారణమని వ్యాపారస్తులు చెబుతూ వస్తున్నారు.
ధరల వ్యత్యాసం ఎలా ఉన్నప్పటికీ.. దసరా రోజు నాన్ వెజ్ వంటకాలు తప్పనిసరి కావడంతో మార్కెట్లో మటన్ చికెన్ కొనుగోలు చోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మటన్ ధరల భారం కారణంగా పలువురు మధ్యతరగతి వినియోగదారులు తక్కువ ధరలో ఉన్న చికెన్ కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ప్రాధాన్యత చూపుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి మటన్ ధరలు తక్కువగానే ఉండడంతో.. దీనిని కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం..