SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kannepalli Pump House: కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోయాలి.. రేవంత్‌ రెడ్డికి కవిత సూచన

Kavitha Demands To Lift Water From Kannepalli Pump House: కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. రూ.25 కోట్లు ఖర్చు చేసి పనులు చేస్తే నీటిని ఎత్తిపోసుకోవచ్చని పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 19, 2026, 03:58 PM IST | Updated: Oct 19, 2026, 04:01 PM IST
Image Credit: Kavitha Kannepalli Pump House
Join

Telangana Drought Conditions: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక భాగమైన కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలని రేవంత్‌ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ చేశారు. కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలని కోరారు. నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యామ్‌ నిర్మించుకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దని సూచించారు. ప్రశ్నించి, పోరాడటమే కాకుండా ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను  చెబుతున్నట్లు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నెపల్లి పంప్ హౌస్‌ను మాజీ ఎంపీ కవిత పరిశీలించారు. అక్కడ ప్రాణహిత ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రమంతా కరువు పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ప్రాణహిత నది నీళ్లు రోజుకు రెండు టీఎంసీలు ప్రవాహం పోతుంది. కొన్ని బ్యారేజ్‌లు రిపేర్‌లో ఉన్నాయనే కారణం చూపి మూడేళ్లుగా వేల టీఎంసీల నీటిని వృథా చేశారు' అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. రాష్ట్రంలో 21 వేల చెరువులు ఎండిపోయాయి. చెరువులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే వాళ్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది' అని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మాజీ ఎమ్మెల్సీ కవిత ఎత్తిచూపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఒక కాఫర్ డ్యామ్ కడితే సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. నెలన్నర రోజుల్లో రూ.25 కోట్లతో ఈ పనిని పూర్తి చేసి నీళ్లను ఎత్తిపోసుకోవచ్చని సూచించారు. మేడిగడ్డను బైపాస్ చేస్తూ నీటిని రిజర్వాయర్లకు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ కవిత తెలిపారు.

'అన్ని పార్టీలు వచ్చి ఈ అంశంపై పోరాటం చేస్తాయి. కానీ తెలంగాణ రక్షణ సేన మాత్రం పోరాటం చేస్తూనే పరిష్కారం కూడా చూపిస్తోంది. రాష్ట్రంలోని ఎంతో మంది నిపుణులతో మాట్లాడిన తర్వాత మేము ఈ పరిష్కారం చెబుతున్నాం. ప్రభుత్వం బేషజాలకు పోకుండా వెంటనే ఈ పనులను మొదలు పెట్టాలి' అని రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఈ అంశానికి సంబంధించి రేవంత్‌ రెడ్డికి లేఖ కూడా రాస్తామని ప్రకటించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్న చిత్తశుద్దితో తాము ఇక్కడ వరకు వచ్చామని.. ఏదో రాజకీయాలు చేస్తూ టీవీల్లో కనిపించాలనే ఉద్దేశం ఉన్న పార్టీ కాదు అని స్పష్టం చేశారు. తాము చేసిన సూచనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని రైతులకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో రెండు పెద్ద నదులు ఉన్నాయని.. సరిగ్గా వాడుకుంటే తెలంగాణకు ఎలాంటి కరువు ఉండదని మాజీ ఎంపీ కవిత తెలిపారు. కాళేశ్వరంతో కొత్త ఆయకట్టుకు నీరు అందింది. ఇక్కడ ప్రాణహిత నీళ్లు రెండు టీఎంసీలు నీళ్లు ఉన్నాయని.. వాడుకుంటే పొలాలుకు నీళ్లు వస్తాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాపర్ డ్యామ్ కడితే నీటిని మళ్లించుకోవచ్చని..రైతలకు ఎటువంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామాలు తిరగనివ్వం కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్‌ ఇచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES