SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Diwali: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి దీపావళి పండుగ.. మూడు రోజులు అక్కడే!

Telangana CM Will Cebrates Diwali In Kodangal: దీపావళి పండుగను తెలంగాణ ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు చేసుకోబోతున్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 05, 2026, 07:42 PM IST | Updated: Nov 05, 2026, 07:47 PM IST
Image Credit: Telangana CM Diwali
Join

Telangana CM Kodangal Tour: మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో విస్తృత స్థాయి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన దీపావళి పండుగను చేసుకోబోతున్నారు. మూడు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ముఖ్యమంత్రి కొడంగల్‌ పర్యటన సెడ్యూల్‌ విడుదల చేసింది. 7, 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను కూడా ప్రారంభించబోతున్నారు. నియోజకవర్గంలో పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

నవంబర్ 7వ తేదీ
శనివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట చేరుకుంటారు.
ఉదయం 11.10: హకీంపేటలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభం. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రదర్శన స్టాళ్ల సందర్శన
మధ్యాహ్నం 12- 2 గంట: ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశం. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశం.
మధ్యాహ్నం 3: హకీంపేట నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి బయలుదేరుతారు. రాత్రి కొడంగల్‌లో బస.

నవంబర్ 8వ తేదీ
ఆదివారం: ఉదయం 9.15 గంటలకు కొడంగల్ నివాసం నుంచి బయలుదేరి హకీంపేట చేరిక.
9.30 నుంచి 10.20 గంటలకు: స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం
10.20 గంటలకు: అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరణ
10.30 గంటలకు: లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటుచేయనున్న ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన
10.45 గంటలకు: హకీంపేటలో రూ.4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల ప్రారంభం
11 గంటలకు: రూ.2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
11.30 గంటలకు: బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉదయం 11.45 గంటలకు రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ ప్రారంభం
మధ్యాహ్నం 12.15 గంటలకు: కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం ప్రారంభం.
12.45 గంటలకు: దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌, 1.15 గంటలకు రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనం ప్రారంభోత్సవం
మధ్యాహ్నం 1.40 గంటలకు: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్వాల్‌గూడ నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి 167ఎన్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన.
మధ్యాహ్నం 2 గంటలకు: కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభం
మధ్యాహ్నం 2.45 గంటలకు: దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం
మధ్యాహ్నం 3.30 గంటలకు: దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

అభివృద్ధి పనులు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు–2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ రెండో దశ పనులు ఉన్నాయి. విద్యా రంగంలో రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉన్నాయి.

రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్లు, రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ.59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. రూ.46.08 కోట్లతో నిర్మించిన 10 భవనాల ప్రారంభం. రూ.46.08 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 10 ప్రభుత్వ భవనాలను ఈ పర్యటనలో ప్రారంభించనున్నారు. దుద్యాల సమీకృత మండల కార్యాలయ భవనం, కోస్గి సైన్స్ మ్యూజియం, హకీంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీటిలో ఉన్నాయి. దుద్యాల, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్లు, బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొడంగల్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

నవంబర్ 9వ తేదీ
సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కొడంగల్ నివాసం నుంచి హకీంపేటకు బయలుదేరుతారు.
రాత్రి 7 గంటల వరకు: హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగం
ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES