SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సరే.. మరి 12 వేల ప్రాథమిక పాఠశాలలు..3వేల అప్పర్ ప్రైమరీ స్కూళ్ల భవిష్యత్తేంటి?

Telangana Primary Schools Crisis: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం మౌళిక సంస్కరణలు దిశగా అడుగులు వేస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వేలాది ప్రభుత్వ బడులు, లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 15, 2026, 08:45 AM IST | Updated: Oct 15, 2026, 08:47 AM IST
Image Credit: Telangana Primary Schools Crisis
Join

Telangana Primary Schools Crisis: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం మౌళిక సంస్కరణలు దిశగా అడుగులు వేస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వేలాది ప్రభుత్వ బడులు, లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో మోడల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రాథమిక.. అప్పర్ ప్రాథమిక బడుల్లో నాణ్యమైన విద్య కరువైందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16వేల ప్రాథమిక బడులు ఉంటే.. అందులో  4793 బడుల్లో సింగిల్ టీచర్ ఉంటే..  ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న సుమారు 7000 పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుంది.  అంటే సుమారు 12వేల పాఠశాలలో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో విద్యబోధన జరుగుతుందని అర్థమవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య ఈ 12వేల పాఠశాలలకు ఎలా అందుతుందని.. ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సుమారు 4000 పాఠశాలల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ టీచర్లచే విద్య బోధన జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 4వేల స్కూళ్లలో మాత్రమే నాణ్యమైన విద్య బోధన అందే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.  

3వేల అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి.  ఈ స్కూళ్లలో దాదాపు 2లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఈ 3వేల అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించేందుకు కనీసం స్కూల్ అసిస్టెంట్ టీచర్లు లేకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థులు 8వ తరగతి వరకు సరైన ఆంగ్ల బోధన లేకుండా  చదువును పూర్తి చేస్తున్నారు. నేరుగా 9వ తరగతిలోకి అడుగుపెడుతున్నారు. అప్పటి వరకు ఇంగ్లీష్ సబ్జెక్టుపై పట్టు లేకపోవడంతో 9వ తరగతిలోకి రావడం.. అక్కడ.. ఇంగ్లీష్ అర్థం కాక విద్యార్థులు సబ్జెక్టుల్లో వెనకబడిపోతున్నారు. ఇటీవలి కాలంలో నిర్వహించిన బాహ్య మూల్యాంకన ఫలితాల్లోనూ 9వ తరగతి విద్యార్థుల ప్రదర్శనపై వచ్చిన పత్రిక కథనాలు ఈ దారుణ పరిస్థితి అద్దం పడుతున్నాయని చెప్పాలి.

అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో సబ్జెక్ట్ వైజ్ టీచర్లు, హెడ్ మాస్టర్లు, పీఈటీలు, అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి సాధారణ ప్రభుత్వ ప్రాథమిక, యూపీఎస్ బడుల్లో మాత్రం ప్రాథమిక వసతులు ..ఉపాధ్యాయుల కొరత అనేది తీవ్రంగా వేధిస్తున్నా..ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. 120 పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుతో మిగిలిన 15వేలకు పైగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. కాలక్రమేణా ఆ స్కూళ్ల మూతపడే ప్రమాదం కూడా ఉందన్న ఆందోళన ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వ బడుల్లో విద్య నాణ్యత పెరగాలంటే కేవలం మోడల్ స్కూల్లు మాత్రమ సరిపోవని.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జీవో నెంబర్ 25ను వెంటనే సవరించాలని డిమాండ్  చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని డిమాండ్లను సైతం ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చారు.

జీవో నెంబర్ 25ను వెంటనే సవరించి.. ప్రతి ప్రాథమిక.. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ప్రతీ తరగతికీ ఒక టీచర్ ను కేటాయించాలి. దీంతో పాటు ఒక హెడ్ మాస్టర్ నియమించాలి. యూపీఎస్ బడుల్లో ఇంగ్లీష్ సహా అన్ని సబ్జెక్టులకు సబ్జెక్ట్ వైజ్ టీచర్ ను అందుబాటులో ఉంచాలి. ప్రతి మండలంలో 8 నుంచి 10 పాఠశాలలను సెలక్ట్ చేసి క్లస్టర్ స్థాయిలో మౌలిక వసతులు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, బోధన పరికరాలను కల్పించాలి. తక్కువ విద్యార్థులు ఉన్నారన్న సాకుతో స్కూళ్లను విలీనం చేయడం కాకుండా.. ప్రతి స్కూళ్లో కనీస ఉపాధ్యాయులను నియమించినప్పుడే తెలంగాణలోని ప్రతి పేద విద్యార్థికి సమగ్ర , నాణ్యమైన విద్య అందుతుందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES