SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ippa Puvvu Tea: తెలంగాణ స్పెషల్‌ ఇప్ప పువ్వు టీ.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Telangana Special Ippa Puvvu Chai: మనకు టీ అంటే.. అల్లం చాయ్.. మసాలా చాయ్.. గ్రీన్ టీ.. లెమన్ టీ అని తెలుసు. కానీ ఇప్ప పువ్వు చాయ్ ఒకటి ఉంది తెలుసా? తెలంగాణలో కొత్తగా తయారు చేసిన ఇప్ప పువ్వు చాయ్‌ గురించి తెలుసుకుందాం. ఆ చాయ్‌ తయారీ ఎలా? ఆ చాయ్‌తో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 10:47 PM IST | Updated: Nov 06, 2026, 10:51 PM IST
Image Credit: Source: Seethakka X (Twitter)
Join

Ippa Puvvu Chai: అల్లం చాయ్, మసాలా చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ ఇలా ఎన్నో రకాల చాయ్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యం కోసం మరికొన్ని రకరకాల చాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ తొలిసారిగా అటవీ ఉత్పత్తులను ఉపయోగించి.. అడవిలో దొరికే పువ్వు నుంచి చాయ్‌ తయారుచేశారు. ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే ఆ చాయ్‌ను తెలంగాణ ప్రభుత్వం పరిచయం చేసింది. అదే ఇప్ప పువ్వు చాయ్‌. ఇప్ప పువ్వుతో తయారుచేసే టీని ప్రారంభించారు. ఆ చాయ్‌ ప్రత్యేకతలు, ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం.

అడవిలో ఇప్ప పువ్వు దొరుకుతుంది. ఆ పువ్వుతో చాయ్ తయారుచేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఇప్ప పువ్వుతో తయారుచేస్తున్న లడ్డూలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్న వేళ ఇప్ప పువ్వు టీకి కూడా విస్తృత ప్రచారం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం వద్ద మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇప్ప పువ్వు టీ స్టాల్‌ ఏర్పాటైంది. ఈ స్టాల్‌ను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ప్రారంభించారు.

అడవుల్లో సహజంగా లభించే ఇప్ప పువ్వు ఆదివాసి గిరిజనుల జీవన విధానంలో భాగం. ఇప్ప పువ్వుతో గిరిజనులు తమ అటవీ ఉత్పత్తుల్లో భాగంగా చేసుకున్నారు. తరతరాలుగా వారు ఇప్ప పువ్వును వివిధ అవసరాలకు వినియోగిస్తుండడంతో ఆ పువ్వుతో టీని తయారుచేయడం కొత్తగా నేర్చుకున్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించడానికే పరిమితం కాకుండా.. వాటికి అదనపు విలువ జోడించి మార్కెట్‌లో విక్రయించాలనే ఆలోచన కలగడంతో డ్వాకా సంఘాల ఆధ్వర్యంలో ఇప్ప పువ్వు చాయ్‌ తయారుచేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఇప్ప పువ్వు చాయ్‌ స్టాల్‌ ఏర్పాటుతో గిరిజన మహిళలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇప్ప పువ్వు టీ స్టాల్‌ ప్రారంభం అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 'మహిళా స్వయం సహాయక సంఘాలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో వినూత్న ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారవేత్తలుగా ఎదగాలి. ఇప్ప పువ్వు టీకి ప్రజల్లో ఆదరణ పెరిగేలా తానే ప్రచారం చేస్తానని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది' అని భరోసా ఇచ్చారు. ములుగు ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఇప్ప పువ్వు టీని ప్రత్యేక ఆకర్షణగా పరిచయం చేయడంతో పాటు, ఈ ఉత్పత్తిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అటవీ సంపదకు విలువను జోడించి ఆదివాసి గిరిజన మహిళల చేతుల్లో ఆర్థిక సంపదగా మార్చడమే లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES