SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉపాధ్యాయుల కొరతతో కుదేలవుతున్న బడులు.. వేలమందిని మార్చినా తీరని తిప్పలు.. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు?

Telangana Teacher Shortage: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ల కొరతను నివారించేందుకు చేపట్టిన సర్దుబాటు ప్రక్రియ కేవలం నామమాత్రంగానే మిగిలింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6వేల మందికి పైగా మిగులు ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసినా.. క్షేత్రస్థాయిలో సమస్య మాత్రం పూర్తి పరిష్కారం కాలేదు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 13, 2026, 11:13 AM IST | Updated: Oct 13, 2026, 11:15 AM IST
Image Credit: Telangana Teacher Shortage
Join

Telangana Teacher Shortage: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ల కొరతను నివారించేందుకు చేపట్టిన సర్దుబాటు ప్రక్రియ కేవలం నామమాత్రంగానే మిగిలింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6వేల మందికి పైగా మిగులు ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసినా.. క్షేత్రస్థాయిలో సమస్య మాత్రం పూర్తి పరిష్కారం కాలేదు. బడుల్లో బోధనకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసినా.. ఆ ఫైల్ మాత్రం ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. సాధారణ, ఉర్దూ మీడియం స్కూళ్లలో కలిపి మొత్తం 1713 మంది ఇన్ స్ట్రక్టర్లను నియమించాలని నాలుగు నెలల క్రితమే విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి సర్కార్ కు ప్రతిపాదనలు పంపించారు. అయితే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుండి ఎలాంటి క్లియరెన్స్ రాకపోవడంతోనే ఆ ఫైల్ నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

విద్యా సంవత్సరంలో ఆరంభంలోనే పాఠశాలల్లో నెలకున్న ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు విద్యాశాఖ వర్క్ అడ్జస్ట్ మెంట్ చేపట్టింది. కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6200 మంది మిగులు టీచర్లను అవసరం ఉన్న స్కూల్లకు డిప్యూటేషన్ పై  పంపించింది. అయినా యూడైస్ విద్యార్థుల లెక్కల ప్రకారం ఇంత భారీ మొత్తంలో టీచర్లను సర్దుబాటు చేసిన వందల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా ప్రైమరీ, హైస్కూళ్లలో గణితం, సామాన్య శాస్త్రం, భాష పండితులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఎక్కడ ఎంత కొరత ఉందని పరిశీలిస్తే.. జనరల్ స్కూళ్లలో మొత్తం 1173 మంది ఇన్ స్ట్రక్టర్లు అవసరమున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిలో కేవలం ప్రాథమిక పాఠశాలల ఖాళీలు 439 వరకు ఉన్నాయి. హైస్కూళ్ల విషయానికి వస్తే.. లాంగ్వేజ్ 2(276)  మ్యాథ్స్ (84), ఇంగ్లిష్ (81), సోషల్ (77), బయాలజీ (61), అలాగే ఫిజికల్ సైన్స్ (52) పోస్టుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక  జిల్లాల వారీగా చూసినట్లయితే... మేడ్చల్ మల్కాజ్ గిరిలో అత్యధికంగా 472.. జోగుళాంబ గద్వాల జిల్లాలో 345, నారాయణపేట జిల్లాలో 129 మంది ఇన్ స్ట్రక్టర్లు అవసరం ఉందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని 462 ఉర్దూ బడుల్లో చదువుతున్న 25,912 మంది విద్యార్థుల కోసం మరో 540 మంది ఉపాధ్యాయులు కావాలని తేల్చారు. దీనిలో నిజామాబాద్ లో 93, కామారెడ్డిలో 62, ఆదిలాబాద్, మహబూబ్ నగర్  జిల్లాల్లో చెరో 60 చొప్పున ఉపాధ్యాయుల కొరత ఉందని స్పష్టం తెలుస్తోంది.

అయితే కరోనా కాలం నుంచి రాష్ట్రంలో విద్యావాలంటీర్ల వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో చాలా గ్రామాల్లో ఏకోపాధ్యాయ స్కూల్లు కొనసాగుతుండగా.. ఉన్నతపాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక టెన్త్ విద్యార్థుల సిలబస్ పూర్తిగా వెనకబడుతోంది. ప్రభుత్వానికి రిపోర్టు అంది 4 నెలలకుపైగానే అయినా ఆర్థిక శాఖ నుంచి ఇంకా ఆమోదం లభించకపోవడం వల్ల విద్యాశాఖ పోస్టులను మంజూరు చేయకపోవడంతో తీవ్ర అయోమయం నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్లకు నెలకు రూ. 15600 గౌరవ వేతనం చెల్లించాలి. 10 నెలల కాలానికి జనరల్ పాఠశాలలకు రూ. 18.29కోట్లు, ఉర్దూ పాఠశాలలకు రూ. 8.42 కోట్లు కలిపి మొత్తం రూ. 26.72 కోట్ల అవసరం అవుతాయి. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES