SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇష్టమైన షర్ట్‌పై ఇంక్ మరక పడిందా? పడేయకండి.. ఇంట్లో ఉండే వీటితో ఒక్క నిమిషంలో మాయమైపోతుంది!

అనుకోకుండా ఇష్టమైన షర్ట్‌పై ఇంక్‌ మరక పడితే.. చాలా మంది దాన్ని పడేస్తారు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా ఇంక్‌ మరకను తొలగించుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 23, 2026, 16:37 IST | Updated: Nov 23, 2026, 16:41 IST
Image Credit: Clothes Stain Removal:
Join

Clothes Stain Removal: చాలామంది వారు ధరించిన షర్ట్‌పై ఇంక్‌ పడితే.. ఇక అది పనికి రాదు అనుకుంటారు. దాన్ని తొలగించడం కూడా కష్టతరం. అయితే, ఇంట్లో ఉండే వస్తువులతో ఇంక్‌ మరకలను తొలగించవచ్చు. ఆ షర్ట్‌ను పడేయాల్సిన అవసరం లేదు. కేవలం షర్ట్‌ మాత్రమే కాదు బ్యాగ్‌, ప్యాంట్‌పై కూడా ఇంక్‌ పడితే తొలగించుకోవచ్చు

సాధారణంగా ఇంక్‌ పడితే ఆల్కహాల్‌ రుద్దితే అది సులభంగా తొలగిపోతుంది. ప్రత్యేకంగా ఆయిల్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ ఇంక్‌ పోతుంది.  ముందుగా మరక పడిన ప్రాంతంలో ముందుగా పేపర్‌ టవల్‌ పెట్టండి. ఇప్పుడు రబ్బింగ్‌ ఆల్కహాల్‌ డ్రాపర్‌ సహాయంతో వేసి కొన్ని నిమిషాల తర్వాత రబ్‌ చేయండి. అలా మరక పోయే వరకు రబ్‌ చేయండి. ఇంక్‌ పోయిన తర్వాత చల్లనీటిలో ముంచి సాధారణంగా వాష్‌ చేయండి.

ఈ మరక చాలా కఠినంగ ఆఉంటే అమ్మోనియా వాడండి. ఇది మచ్చలను బ్రేక్‌ చేస్తుంది. ముందుగా మరక పడిన ప్రాంతంలో చల్లనీటిని పోయండి. ఆ తర్వాత కాస్త వేడి నీరు, బ్లీచ్‌ ఫ్రీ డిటర్జెంట్‌, కొద్దిగా అమ్మోనియా వేసి సొల్యూషన్‌ రెడీ చేయండి.ష ఇందులో ఓ అరగంట మరక పడిన షర్ట్‌ నానబెట్టండి. రాత్రంతా కూడా నానబెట్టి ఉతకవచ్చు.

నెయిల్‌పాలిష్‌ రిమూవర్‌..
నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌తో కూడా షర్ట్‌పై పడిన ఇంక్‌ మరకను తొలగించుకోవచ్చు కొద్దిగా రిమూవర్‌ తీసుకుని మరకపడిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఆ తర్వాత కాటన్‌ బాల్‌ సహాయంతో మృదువుగా రబ్‌ చేయండి. ఆ తర్వాత సాధారణంగా వాష్‌ చేస్తే సరిపోతుంది.

చాలామంది మరిన్ని చిట్కాలు కూడా ఉపయోగిస్తారు. ఇంక్‌ పడిన దుస్తులను హెయిర్‌ స్ప్రే, టూత్‌ పేస్ట్‌, వెనిగర్‌, నిమ్మకాయ కూడా వాడి వదిలిస్తారు. అయితే, ఏ వస్తువులు వాడినా జాగ్రత్తపడండి. ప్రత్యేకంగా రబ్బింగ్‌ ఆల్కహాల్‌ వాడినప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ షర్ట్‌ పాడైపోయే ప్రమాదం ఉంది. దుస్తులపై మొండి మరకలు పడితే ఇలా వదిలించుకోవచ్చు. కొంతమంది కాటర్‌ దుస్తులపై మరకలు పడితే వాటిని ఉతికి ఎండలో ఆరబెడతారు. తద్వారా కూడా మరక ప్రభావం తగ్గుతుంది.

మొండి మరకలు మాత్రమే కాదు తెలుపు రంగు దుస్తులు వాష్‌ చేసినప్పుడు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని ప్రత్యేకంగా మాత్రమే ఉతకాలి. లేకపోతే రంగు దుస్తులు తెల్లటి దుస్తులను పాడు చేసే అవకాశం ఉంది. ఏదైనా కొత్తగా దుస్తులు కొనుగోలు చేసినా ముందుగా వాటిని ఉతకాలి. ప్రత్యేకంగా కాటన్‌ దుస్తులను ఉప్పు వేసి కొంత సేపు నానబెట్టి ఉతికితే రంగు పోకుండా ఉంటుంది అని కొందరు నమ్ముతారు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES