ఏపీలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు.. నేటి నుంచి 20 వరకు నామినేషన్లు..
AP Panchayat Election 2nd Phase: ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక రెండో విడతలో మొత్తం 4 వేల 960 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ కండక్టర్ చేయనున్నారు.
AP Local Body Election: ఆంధ్ర ప్రదేశ్ రెండో విడత పంజాయితీ ఎన్నికల్లో 4 వేల 960 మంది సర్పంచులు, 49, 224 మంది వార్డు సభ్యుల స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. సెకండ్ ఫేస్‌లో భాగంగా నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధులకు ఛాన్స్ కల్పించారు. 23వ తేదీన అప్పీళ్లను పరిష్కరించనున్నారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణకు టైమ్ ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
ఈ నెల 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు..
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అపుడే వెల్లడిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించి అనంతరం రిజల్ట్ ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు..
గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోని ఘటనలపై పోలీసులు, ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు.
పంచాయితీ ఎన్నికల వేళ..
పంచాయతీ ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి దుర్ఘ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే మోహరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పంచాయతీ నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ, ZPTC, MPTC ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలతో ఈ చర్యలు చేపట్టారు. . గత ఎన్నికల్లో వైసీపీ, కూటమి నేతల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు రిపీట్ కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.