• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

కొందరికి ఇంట్లో వండిన ఆహారం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. దీనికి ప్రధాన కారణం అతిగా నూనె, నెయ్యి, షుగర్ వాడటం. వీటి వల్ల లివర్ పనితీరుపై ప్రభావం పడి, క్రమంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. అయితే మనం చేసే ఐదు రకాల తప్పులే లివర్ డ్యామేజ్ కావడానికి కారణం. బయట ఫుడ్ తినకపోయినా, ఇంట్లో ఫుడ్ ద్వారానే ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. అవేంటో తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 22, 2026, 17:47 IST|Updated: Nov 22, 2026, 17:49 IST
joinshare
బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?
Image Credit: Home Cooked Food Cause Fatty Liver:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Home Cooked Food Cause Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ప్రధానంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అంతేకాదు, ఉప్పు, చక్కెర అతిగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతోంది. కొంతమంది బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ తింటున్నప్పటికీ ఫ్యాటీ లివర్ సమస్యకు గురవుతున్నారు. రెస్టారెంట్ ఆహారం అనారోగ్యకరమని భావించి ఇంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. కానీ వారు అతిగా నూనె, నెయ్యి, చక్కెర వాడటం వల్ల లివర్ సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

రోజువారీ ఆహారంలో పరాటాలు, పకోడీలు, పూరీలు, ఫ్రై చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం రుచికరంగా ఉంటుంది, కానీ అవి అనారోగ్యకరం. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ నూనె తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతుంది. అప్పుడప్పుడు తింటే పర్వాలేదు, కానీ ఎప్పుడూ వీటిని తీసుకుంటే లివర్‌పై ప్రభావం పడుతుంది. క్రమంగా ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. దీనికి తోడు శారీరక శ్రమ లేకపోతే ఇది మరింత ప్రమాదకరం. ఆహారంలో మితంగా నూనె, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు మాత్రమే తీసుకోండి.

ఈరోజుల్లో స్వీట్స్ ఎక్కువగా తినేవారు వాటిని ఆపేయాలి. హల్వా, కీర్ వంటి స్వీట్స్ తీసుకుంటే చక్కెర ఎక్కువై, అది లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అలాగే షుగర్ ఉండే డ్రింక్స్, ఎక్కువ చక్కెర ఉండే జ్యూసులు తీసుకోవడం కూడా లివర్‌కు హానికరం. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్, అంటే మైదా వంటి పిండితో చేసిన ఆహారాలు తీసుకుంటే క్యాలరీలు పెరుగుతాయి, ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది.

కొంతమంది అవసరానికి మించి ఆహారం తింటారు. శరీరం కోరుకునే దానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఇంట్లో తినే ఆహారం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీంతో భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చక్కెర, స్వీట్స్, ఉప్పు తగ్గించడమే కాదు, ఆయిల్ ఎక్కువగా ఉండే ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది. మీ ఆహారంలో నూనెను తగ్గించుకోవడం మంచిది. నెయ్యి, బటర్ వంటివి కూడా తగ్గించాలి. సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులకు ప్రాధాన్యత ఇవ్వండి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల బరువు ఆరోగ్యకరంగా ఉంటుంది. షుగర్ ఉండే డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోకూడదు. డయాబెటిస్, ఒబేసిటీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సరైన సూచనలు తీసుకొని వాటిని తప్పకుండా పాటించాలి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
daily life
Telugu News