SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో క్లీన్ స్వీప్ దిశగా కూటమి..?

AP Muncipal Corporation Elections: ఆంధ్రప్రదేశ్‌లోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు , నగర పంచాయతీలకు సంబంధించి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్‌లో తొలి ట్రెండ్స్ నుంచి తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 01:55 PM IST | Updated: Nov 03, 2026, 01:59 PM IST
Image Credit: AP Muncipal Election Results (ZEE News Telugu/Source)
Join

AP Local Body Election Counting: రాష్ట్ర వ్యాప్తంగా  మెజారిటీ మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే కూటమి పార్టీలు తమ అధిక్యం దిశగా దూసుకెళ్లారు.  తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, కడప, విజయనగరం వంటి ప్రధాన కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా విశాఖ, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో టీడీపీ మేయర్ అభ్యర్థులు స్పష్టమైన లీడ్‌లో కొనసాగుతున్నారు. అమలాపురం, నర్సాపురం, తిరువూరు వంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు బలమైన ఆధిక్యంతో దూకుడు మీదున్నారు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ మున్సిపాలిటీలు కూటమి కైవసం చేసుకోగా.. పుంగనూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది.  మొత్తంగా 13 కార్పోరేషన్‌లకు గాను తెలుగు దేశం 9, జనసేన 1 కార్పోరేషన్లలలో ముందంజలో ఉన్నారు.


ప్రతిష్టాత్మక కుప్పం మున్సిపాలిటీని తెలుగు దేశం పార్టీ  కైవసం చేసుకుంది. ఇక్కడ పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విక్టరీ సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతల మధ్య పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పెద్దాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థులు వరుస వార్డులను కైవసం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. అలాగే నర్సాపురం మున్సిపాలిటీలో కూడా కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. మార్కాపురంలో క్లీన్ స్లీప్ చేసే దిశగా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తుండగా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు భారీ సంఖ్యలో వార్డులను గెలుచుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు , కడప జిల్లా పులివెందుల వంటి కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ సిట్టింగ్ స్థానాలను, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కొంత పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నించారు.

‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాలైన రేపల్లె తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అడ్డు తగిలింది.  కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది రాక ఆలస్యం కావడం, స్ట్రాంగ్ రూమ్‌ల తాళాల కోసం స్వల్ప గందరగోళం నెలకొన్నప్పటికీ, ఎన్నికల అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కౌంటింగ్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మరో రెండు మూడు గంటల్లో పూర్తి స్థాయి కౌంటింగ్ ట్రెండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES