CM Chandrababu naidu: రప్పా రప్పా అంటే తాటతీస్తాం.. పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు వార్నింగ్..
Police Commemoration Day meeting in ap: మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో నిర్వహించిన'పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పోలీసులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
CM Chandrababu fires on ys jagan: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన తర్వాత రాజకీయాలు హీటెక్కాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే పలు చోట్ల వైసీపీ వర్సెస్ కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈక్రమంలో దీనిపై వైసీపీ ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఈ క్రమంలో ఎస్ఈసీ పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని అప్పుడు జగన్ 2.0 ఉంటుందని ఫైర్ అయ్యారు.ఈ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో కౌంటర్ ఇచ్చారు.
మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో నేడు నిర్వహించిన 'పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం' కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సంతాపం వ్యక్తం చేశారు. పోలీసు అంటేనే బాధ్యత, భరోసా అని కొనియాడారు. ప్రజల కోసం పోలీసులు తమ వ్యక్తిగత జీవితాల్నిసైతం త్యాగం చేస్తున్నారని మాట్లాడారు.
ఇటీవల దసరా, విజయవాడ ఉత్సవ్, వీఐపీ పర్యటనలు ప్రశాంతంగా ముగియడం వెనుక పోలీసుల పాత్ర ఎంతో ఉందన్నారు. పోలీసుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికి మరవదని చెప్పుకొచ్చారు. ఏపీలో ఇటీవల రప్పా.. రప్పా.. అంటూ ఫ్యాక్షన్ రాజకీయాలు మాట్లాడుతున్నారని వీటిని పోలీసులు తాటతీయాలని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. భద్రత ఉంటే పెట్టుబడులు వస్తాయని దీనితో యువతకు ఉపాధి దక్కుతుందని మాట్లాడారు. అంతే కాకుండా.. ఆధునిక నేరాలకు టెక్నాలజీతో చెక్ పెట్టాలన్నారు. ఫోన్ కాల్, లింక్ లో డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లను పట్టుకొవడానికి కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొవాలన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, వంటి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించి దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకొవాలన్నారు. మహిళలపై నేరాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. పోలీసుల అమరవీరుల కుటుంబాలకు, పోలీసు డిపార్ట్ మెంట్ కు తమ ప్రభుత్వం ఎప్పుుడు అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.