Andhra Pradesh Record Commercial Taxes Collections Of Rs 30435 Crore And 18 Percent Increased Growth: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. పన్నుల వసూళ్లలో ఏపీ గణనీయంగా వృద్ధి సాధిస్తోంది. సెప్టెంబర్ నెల వరకు చూస్తే 18 శాతం వృద్ధి నమోదైంది. ఇక వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.30 వేల కోట్లకు చేరాయి. ఏపీ వాణిజ్య పన్నుల వసూళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి.
AP CM Chandrababu Naidu Interesting Comments On His Political Life: సీఎం పదవి తనకు కొత్త కాదని.. తెలుగు ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, పవన్ కల్యాణ్, మోదీ కలిశామని తెలిపారు. సుపరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
AP PRC Chairman Dinesh Kumar: ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) చైర్మన్‌ను కూటమి ప్రభుత్వం నియమించింది. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తాజాగా వెలువడ్డాయి.
Boy working as shepherd in prakasam: బడిలో పాఠాలు చదవాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడుతున్న నర్రవాడ గ్రామానికి చెందిన బాలుడి ఘటనపై మంత్రి నారాలోకేష్ రియాక్ట్ అయ్యారు. అంతే కాకుండా అతడికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు.
AP High Court On Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు పచ్చజెండా ఊపుతూ కీలకమైన తీర్పును వెలువరించింది. స్థానిక పోరులో బీసీ అభ్యర్థులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ వాటిని రద్దు చేసింది. అదే క్రమంలో, రాబోయే ఆరు వారాల వ్యవధిలోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
CM Chandrababu Visit Repalle: సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా రేపల్లె పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు.
AP SIR Extended: ఆంధ్ర ప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పెంచింది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కారణ గడువు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5తో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువు ముగియనుంది.
Arasavelli temple in Srikakulam: చాలా మంది భక్తులు ఉదయం నుంచి అరసవల్లి ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో సూర్య కిరణాలు మాత్రం మూల విరాట్టును తాకక పోవడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Cheddi gang in Tirupati: తిరుచానూరు పంచాయతీ పరిధిలో రాత్రిపూట చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. పలు సీసీఫుటేజీలో వారి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
AP AC Bus Free Women Travel: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత దిశగా మరొక కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరిస్తూ, త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త ఏసీ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు.
Kolikapudi Srinivasa Rao Controversy: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక ప్రభుత్వ పీఈటీ టీచర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన ఇంటికి పిలిపించి కర్రతో కొట్టారని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఈ ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆయన ఫిర్యాదు చేశారు.
School hm kidnapped in palnadu: కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఏకంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. ఏపీలోని పల్నాడులో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Crane accident in Tirupati: భవన నిర్మాణం కోసం జేసీబీతో మట్టిని తీస్తుండగా ఇంతలో పెను విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో జరిగిన విషాదంలో ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోవడం అందరిని కలిచి వేసింది.
Guntur Raiding Brothels: ఏపీలోని గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార దందా గుట్టు రట్టయ్యింది. కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచార దందాను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
Rural Development, AP Panchayat Raj and Rural Development, Pawan Kalyan, AP News, Chandrababu, SKOCH Award, AP Rural Development, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పవన్ కల్యాణ్, స్కోచ్ అవార్డు,AP Panchayat Raj and Rural Development Crossed National Level Milestone Between 2024 To 2026 | AP Development: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలో ఏపీ అద్భుత ప్రగతి.. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపుAP Panchayat Raj and Rural Development: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రెండేళ్లలోనే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అపూర్వ విజయాలు సాధించింది. రెండేళ్లలో సాధించిన ప్రగతి నివేదిక ఇదే.
Lizard In Sambar Tuni Junior College: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా తునిలో విషాహారం తిని 19 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. స్థానిక తుని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మధ్యహ్న భోజనంలోని సాంబారులో బల్లి పడింది. అది తెలియకుండా విద్యార్థినులు ఆహారం తినగా, వారిలో 19 మంది బాలికలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో హుటాహుటిని ఆస్పత్రిలో చేర్చారు.
AP Ward Secretariat Employees Promotions: ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆయా ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా జీవో ఎంఎస్ నంబర్ 244 (G.O.MS.No. 244) జారీ చేస్తూ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మిగతా పోస్టుల సర్దుబాటు ప్రక్రియకు ద్వారా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పరిధిలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Vijayawada CI Heart Attack Death: విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న నున్న పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ అలీ హఠాత్తుగా మృతిచెందారు. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న ఆయన.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రాణాలు కాపాడాలని వైద్యులు ఎంతగానో ప్రయత్నించగా, ఫలితం లేకుండా పోయింది.
Vijayawada Woman Murder Case: విజయవాడ సమీపంలో ఇటీవలే లభ్యమైన మహిళా మృతదేహం కేసులో ఇప్పుడు కీలక ట్విస్ట్ బయటపడింది. మంగళగిరికి చెందిన కళ్యాణి అనే మహిళ మృతదేహాన్ని 9 ముక్కులుగా చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు ఈ హత్య కేసులో పురోగతిని సాధించేందుకు పెద్ద సవాలుగా మారింది.