SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Arnab Cyclone: ఏపీలో అర్నబ్ టెర్రర్ వేళ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏకంగా రూ.27 కోట్ల విడుదల.!.

CM Chandrababu naidu: అర్నాబ్ తుపాను వేళ ఏపీ సీఎం చంద్రబాబు అన్ని శాఖలకు చెందిన అధికారులతో గంట గంటకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 26, 2026, 09:01 PM IST | Updated: Oct 26, 2026, 09:18 PM IST
Image Credit: chandrababunaidu(file)
Join

CM Chandrababu naidu key review on cyclone Arnab effect: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుపాను నేపథ్యంలో  ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఈక్రమంలో అధికారులతో గంట గంటలకు సమావేశం నిర్వహిస్తున్న కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అర్నబ్ తుపాన్ గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా తుపాను కదలికలు ఉన్నాయి.  ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 520 కి.మీ. దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 540 కి.మీ. దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 620 కి.మీ. దూరంలో, మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 720 కి.మీ. దూరంలో, బాపట్లకు తూర్పు, ఆగ్నేయంగా 790 కి.మీ. దూరంలో, అండమాన్ దీవుల్లోని శ్రీ విజయ పురానికి వాయువ్యంగా 680 కి.మీ. దూరంలో ఉందని వాతావరణ అధికారులు సూచించారు. 

ఈ క్రమంలో బంగాళా ఖాతంలో వాయుగుండం రేపు, ఎల్లుండి అతి తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత  ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ, అక్టోబర్ 28, 2026 ఉదయం లోపు బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాంకు సమీపంలో ఆంధ్రప్రదేశ్,  యానాం తీరాలను దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో గంటలకు 115–125 కిలోమీటర్ల నుంచి  గంటకు 140 కిలోమీటర్ల వరకు గాలులు వీచే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

 ఏపీలోని అన్ని జిల్లాల అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయా తుపాన్ ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్లకు సెలవుల్ని రెండు రోజులపాటు ప్రకటించారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. ఆయా జిల్లాల అధికారులతో సీఎం చంద్రబాబు వర్చువల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. 

తుపాన్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేయాలని అన్ని రకాల సహాయక చర్యల్ని అందించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్బిణిలు, దివ్యాంగులకు ఎక్కడ కూడా ఆహరం, వసతులు, ప్రథమి చికిత్స కిట్ లు మొదలైన వాటిని ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా

వైద్య బృందాలను, అంబులెన్సులను, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలొకి దింపారు. విద్యుత్ సరఫరా, నిత్యవసరాలు, రేషన్ లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నాలుగు గంటలకు ఒకసారి   బులెటిన్ లను విడుదల చేస్తు ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు.


అర్నబ్ తుపాన్.. రూ. 27 కోట్ల విడుదల..

ఏపీలో అర్నాబ్ తుపాన్ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత 20 జిల్లాలకుగాను.. రూ. 27 కోట్లను విడుదల చేసింది. ప్రకాశం, పొలవరం, పార్వతిపురం, మన్యం, గుంటూరు, ఎన్టీఆర్, మార్కాపురం,విశాఖ, విజయ నగరరం, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ. కోటి చొప్పున అధికారులు కేటాయించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES