SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Triple Engine Govt: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఏపీలో వచ్చేది ట్రిబుల్‌ ఇంజన్‌ సర్కార్‌

Chandrababu, Local Body Elections, Nellore, Triple Engine Govt In AP, Andhra Pradesh, AP News, AP Local Body Elections, Telugu Desam Party, Chandrababu News In Telugu, Chandrababu Updates, Amaravati, చంద్రబాబు, స్థానిక సంస్థల ఎన్నికలు, నెల్లూరు, ఇళ్ల పట్టాల పంపిణీ, CM Chandrababu Says After Local Body Elections Triple Engine Govt Will Come Andhra Pradesh | Triple Engine Govt: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఏపీలో వచ్చేది ట్రిబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ After Local Body Elections Triple Engine Govt Will Come Andhra Pradesh Says CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా గతం కన్నా రెట్టించిన వేగంతో, ఉత్సాహంతో తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్న్మిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 11, 2026, 08:10 PM IST | Updated: Oct 11, 2026, 09:58 PM IST
Image Credit: Source: Jai TDP Twitter
Join

Amaravati: కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది' అని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. నీతి, నిజాయితీ, నిస్వార్ధంగా పనిచేసే నాయకులను గెలిపించాలని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో మీరు వేసిన ఓటు ప్రతీ ఒక్కరి జీవితాన్ని, ప్రతీ కుటుంబాన్ని, రాష్ట్రంలోనూ మార్పు తెచ్చిందని తెలిపారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా గతం కన్నా రెట్టించిన వేగంతో, ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ హయాంలో డబ్బులు ఇవ్వనిదే పట్టాలు చేతికి రాలేదని గుర్తుచేశారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ కోసం కృషి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.

నెల్లూరులో సర్వేపల్లి కట్ట ఇళ్ల పట్టాల పంపిణీని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా సీఎం చంద్రబాబు ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. 'రాష్ట్రాన్ని పునర్న్మిస్తామని ఎన్నికల ముందు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను హామీ ఇచ్చాం. ఆ హామీని 28 నెలల పాలనలో నిరూపించాం. సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు నాంది పలికాం. సుపరిపాలనలో భాగమే పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ. ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.

'701 పట్టాలు మహిళలకు ఇవ్వడం మహిళ సాధికారతలో భాగం. వచ్చే సంక్రాంతి కల్లా నెల్లూరు నగరంలో 4,000 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలిస్తామని మాటిస్తున్నా' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రమంతా ఒక ఉద్యమంలా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని.. విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల కుటుంబాలకు రూ.52,000 కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చామని వెల్లడించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భద్రత, ఆత్మగౌరవం, ఒక ఆస్తి సమకూరాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

'దాదాపు రూ.30 వేల కోట్లను ఖర్చు పెట్టి రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కోసం సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడటం లేదు. వేల కోట్ల రూపాయలు ప్రతీ నెలా సామాజిక పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నామని చెప్పారు. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం కింద ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలను మహిళలు ఉపయోగించుకోవడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.

'దీపం-2 పథకం కింద నేరుగా బ్యాంకు ఖాతాకే సబ్సిడీ డబ్బులు జమ చేస్తాం. విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రజారోగ్యం కాపాడటానికి రాష్ట్రమంతటా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తాం' అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ, నేతన్న సేవలో, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో వంటివి అందిస్తున్నట్లు తెలిపారు.

'గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు, వడ్డెరలకు మైనింగ్ లీజులు ఇచ్చాం. బుర్రిపాలెం నుంచి మొన్ననే 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేశాం. ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లు అందించాం. ప్రకాశం జిల్లాలో గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

'గత ప్రభుత్వం రీసర్వే పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. వాటి స్థానంలో రాజముద్రతో అత్యంత భద్రతా ప్రమాణాలతో పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. సరిహద్దు రాళ్లపై వాళ్ల బొమ్మలను కూడా తొలిగించాం' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో దుర్మార్గంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని చెప్పారు. పల్లెల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి అనుగుణంగా మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

'పట్టణాలను గ్రోత్ సెంటర్లుగా చూస్తున్నాం... జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా పీ4 వంటి కార్యక్రమాలు తీసుకువచ్చాం. ఆర్థిక అసమానతలు తగ్గించాలన్నదే నా సంకల్పం. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మేయర్, చైర్మన్లను నేరుగా ఎన్నుకునే విధానం తీసుకువచ్చామని వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES