Pawan Kalyan: ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. అసలు విషయం ఏమిటంటే.?.
Ap panchayat Elections: ఏపీలో పంచాయతి ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీనాయకలు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైన పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగొచ్చని వెల్లడించారు.
Deputy cm Pawan kalyan on panchayat elections: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలపై రాజకీయాలు హీటెక్కాయి. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య నువ్వా నేనా.. అన్న విధంగా తగ్గా ఫార్ వార్ నడుస్తొంది. ఈ క్రమంలో కొన్నిచోట్ల పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాకపోయినప్పటికి నామినేషన్ లు వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన పార్టీ శ్రేణులకు పూర్తిగా స్వేచ్చనిస్తున్నట్లు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్లు వేసుకొవచ్చని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉండే వారిని ఎవరు అడ్డుకొరని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలని టార్గెట్, ప్రజల మద్దతు ఉన్న వారు ప్రతి ఒక్కరు పంచాయతీ ఎన్నికల బరిలో దిగొచ్చన్నారు.మరోవైపు మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికల తరహాలో పంచాయతీ ఎన్నికలు కాదాన్నారు.
అదే విధంగా దీనిలో సీట్ల సర్దుబాటు సమస్యలు కూడా ఉండవని తెల్చి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా స్థానిక సంస్థల బలోపేతంకు పాటు పడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతుందని, పంచాయతీ ఎన్నికల బరిలో ఉండాలనుకున్న వారు నామినేషన్ దాఖలు చేయవచ్చని తెల్చి చెప్పారు.
మరోవైపు ఇటీవల నాగులగుట్టపల్లిలో నామినేషన్ నేపథ్యంలో తలెత్తిన వివాదంలో జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు.