SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Anantapur: అనంతపురంలో షాకింగ్ ఘటన.. బాలిక కడుపులో బైటపడ్డ 750 గ్రాముల వెంట్రుకలు.. అసలేం జరిగిందంటే..?..

750 gram hairball in girl stomach in ap: బాలిక కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఇటీవల ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో వైద్యులు సర్జరీ చేసి బాలిక కడుపులో పేరుకుపోయిన 750 గ్రాముల వెంట్రుకలను సర్జరీ చేసి వైద్యులు బైటకు తీశారు.

Written By Inamdar Paresh
Published: Nov 18, 2026, 12:42 IST | Updated: Nov 18, 2026, 12:54 IST
Image Credit: 750 grams hair in girl stomach anantapur
Join

Doctor removes 750 grams of hair from girl stomach in Anantapur: మన చుట్టుపక్కల చాలా మంది చిన్న పిల్లలు తరచుగా గోర్లను తినడం లేదా వెంట్రుకలను తినడం అలవాటు ఉండటం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో ట్రైగోఫాగియా అనే మానసిక సమస్యలతో  ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఇది చిన్న తనం నుంచి కొంత మందిలో కన్పిస్తుంది. సరైన సమయంలో  దీనిపై ట్రీట్ మెంట్ తీసుకొకుంటే అనేక సమస్యలు  ఎదురౌతాయని వైద్యులు తరచుగా చెప్తుంటారు.ఈ క్రమంలో  అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) లో వైద్యులు పదో తరగతి చదువుతున్న బాలిక పొట్టలో నుంచి ఏకంగా 750 గ్రాముల వెంట్రుకల ముద్దను బైటకు తీశారు. 


అనంతపురం జిల్లాలో రాయదుర్గానికి చెందిన పదో తరగతి బాలిక ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో స్థానికంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి  ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. కొన్ని రోజులుగా ఆమెకు చికిత్స అందించిన కూడా  బాలిక తరచుగా వాంతులు, కడుపునొప్పి, అజీర్తి, వేగంగా బరువు తగ్గిపొవడం  వంటి సమస్యలతో బాధపడుతుంది. దీంతో వైద్యులు ఆమెకు ఎక్స్ రే, ఇతర టెస్ట్ లు చేయగా కడుపులో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలికకు సర్జరీ అవసరమని చెప్పారు. 

 మరోవైపు వైద్యులు సర్జరీ చేసి బాలిక పొట్టలో ఉన్న వెంట్రుకల ముద్దను బైటకు తీశారు.  బాలిక కడుపులో ఉన్న వెంట్రుకల ముద్దను చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. బాలికకు చిన్న తనం నుంచి వెంట్రుకలు తినే అలవాటు ఉందని తల్లిదండ్రులు చెప్పారు.  వైద్య పరిభాషలో దీన్ని రాపుంజల్ సిండ్రోమ్ అని పిలుస్తారని వెల్లడించారు. వెంట్రుకలను తొలగించడంతో బాలిక పెద్ద ప్రమాదం తప్పింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES