Nara lokesh: పెద్దలను శుభకార్యానికి పిలవడం మన సంస్కృతి.. వైఎస్ జగన్ టార్గెట్‌గా మంత్రి నారా లోకేష్ సెన్సెషనల్ కామెంట్స్..
nara lokesh fires on ys jagan: కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకకు పెద్దలను ఆహ్వానించడం కనీస మర్యాద, మన సంప్రదాయమని మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మహిళల ఆత్మ గౌరవాన్నిహననం చేసే విధంగా జగన్ మీడియాలో వచ్చిన వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister nara Lokesh fires on ys jagan: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన కూతురు పెళ్లి వేడుకకు ఆహ్వనించడం కోసం సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. దీనిపై రాజకీయా దుమారం చెలరేగింది. వైఎస్ జగన్ కు చెందిన ఒక మీడియాలో చెట్టాపట్టాల్ అంటూ వార్తను ప్రచురించడంపై వివాదంకు కేంద్ర బిందువుగా మారింది. దీనిపై ఇప్పటికే వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభకార్యానికి ఇన్వైట్ చేసేందుకు వెళ్తేదాన్ని కూడా రాజకీయం చేయాలా..?.. ఈ ప చ్చ బుద్ది ఇంకా మారదా..అంటూ జగన్ అండ్ బ్యాచ్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మహిళను, అది కూడా కుటుంబ సభ్యుల గురించి ఇంత ఛెండాలంగా రాతలు రాయడం ఏంటని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై తాజాగా.. ఏపీ మంత్రి నారాలోకేష్ సైతం స్పందించారు. జగన్ కు చెందిన మీడియాలో వచ్చిన వార్తపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. ఇంట్లోఏదైన శుభకార్యం జరిగినప్పుడు పెద్దల్ని ఆహ్వనించడం మనం సంప్రదాయమని గుర్తు చేశారు.
ఇలాంటి అంశంపై కూడా రాజకీయాలు చేసి, ఒక మహిళను కించపరిచేలా కథనాలు రాయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య కథనాలను సమాజం ఎప్పటికీ ఆమోదించదని నారాలోకేష్ తెల్చిచెప్పారు.
రాజకీయంగా విభేదాలుఉన్న కూడా కనీసం ప్రాథమిక విలువల్ని పాటించాలని వైఎస్ జగన్ కు మంత్రి నారాలోకేష్ హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలపై ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడటం మానుకొవాలని సూచించారు. ఇదే క్రమంలో వైఎస్ షర్మిలకు, ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ తన శుభాకాంక్షలు తెలిపారు.