MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా? ఎస్ఈసీ నిర్ణయం ఇదే!
MPTC ZPTC Elections Postponement: ఆంధ్రప్రదేశ్‌లో అర్ణబ్ తుఫాన్ తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటం, అలాగే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే విమర్శలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (AP SEC) భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను 5వ తేదీకి, ఓట్ల లెక్కింపును 7వ తేదీకి వాయిదా వేసే దిశగా ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
MPTC ZPTC Elections Postponement: ఏపీలో అర్ణబ్ తుఫాన్ తీరం దాటినప్పటికీ, కోస్తా తీరప్రాంత జిల్లాలపై దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల సాధారణ జనజీవనం సాధారణ స్థితికి చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. తుఫాన్ సృష్టించిన ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యంగా రైతులు, సాధారణ ప్రజలు, అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ఆలోచన..
ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే విమర్శలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ణబ్ తుఫాన్ కారణంగా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం కూడా చేసుకోలేని ప్రతికూల పరిస్థితి నెలకొంది.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల తేదీలు ముందుకు జరపడంతో మరొక ఇబ్బంది తలెత్తింది. దీంతో ముందుగా పరిషత్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసేందుకు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడుగులు వేస్తోంది. తుపాను ప్రభావం ఇవాళ, రేపు మాత్రమే ఉండి, తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ విభాగం నుంచి ఎస్ఈసీకి సమాచారం ఉంది. దీని ఆధారంగా అర్ణబ్ తుఫాన్ ప్రభావం విషయంలో ఆచితూచి, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
పరిషత్, మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్ పరిశీలన..
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిజానికి వచ్చే నెల 3న జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుత తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా ఆ పోలింగ్‌ను వచ్చే నెల 5వ తేదీకి మార్చాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా, గతంలో నిర్ణయించిన ఓట్ల లెక్కింపును 5వ తేదీ నుంచి 7వ తేదీకి వాయిదా వేసే అవకాశం ఉంది. ఇవాళ దీనిపై ఎన్నికల కమిషన్ అధికారికంగా ఒక ప్రకటన చేయనుంది.
ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియను ఈ నెల 28 నుంచి నవంబర్ 1కి వాయిదా వేశారు. అలాగే ఓట్ల లెక్కింపును సైతం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3వ తేదీకి మార్చారు. ఇప్పుడు అర్ణబ్ తుఫాన్ ప్రభావం, అలాగే పరిషత్ ఎన్నికల తేదీలు, ఇతర పలు కారణాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ముందుకు జరిపేందుకు ఎన్నికల కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ ఎస్ఈసీ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.