రెడ్డిగూడెం వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. రంగంలోకి శ్రీశైలం స్పెషల్ టీమ్స్, ఏ క్షణమైనా..!
ఎన్‌టీఆర్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అన్నారవుపేట నుంచి కుదప వైపు వెళ్లడంతో ఆ ప్రాంతాల వారికి కంటి మీద కులుకు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో పులిని బంధించేందకు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
NTR District Tiger Scare: ఎన్‌టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెండ అడవుల్లో పులి సంచారం మూడో రోజు కలకలం రేపుతోంది. శ్రీశైలం రిజర్ ఫారెస్ట్ నుంచి పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని గ్రామస్థులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలెర్ట్ కూడా జారీ చేశారు. అన్నారావుపేట నుంచి కుదప వైపునకు ఈ పెద్దపులి వెళ్లింది. దీంతో అక్కడ స్పెషల్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు.
వరుసగా మూడో రోజు కూడా పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులిని పట్టుకుని బంధించడనికి అధికారులు అడవులు, పరిసర ప్రాంతాలను విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా రంగాపురం గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో పులి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు కూడా అధికారులు చేశారు. పులిని సురక్షితంగా బంధించేందుకు మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది.
ఇక అటవీశాఖ అధికారులతో కలిసి ఈ బృందం పులి కదలికలను గుర్తించేందుకు జియో ట్యాగింగ్ సాంకేతికత సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పులి అడుగుజాడలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా దాని సంచార ప్రాంతాలను గుర్తిస్తున్నారు. మరోవైపు పులి సంచారంతో రంగాపురం, మైలవరం పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకూడదని, పశువుల కాపరులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
మొత్తానికి రంగాపురం గ్రామం వద్ద రెండు కిలోమీటర్ల దూరంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. విస్సన్నపేట మండలం కొండ బరువు గ్రామ శివారులోని సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. కొండపరావు అడవి నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణించి రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామం వైపు వెళ్లినట్లుగా లొకేషన్ చూపిస్తోంది. అక్కడి మామిడి తోటల్లో పులి ఉన్నట్లుగా ఆర్డీవో కుమార్ వెల్లడించారు. గతంలో ఇదే పులి ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరంలో పశువులపై దాడి చేసింది.
అయితే, అప్పుడు పులిని బంధించిన అటవీశాఖ సిబ్బంది. రాజమండ్రి అడవుల్లో వదిలిపెట్టారు. అప్పుడు జియో ట్యాగ్ అమర్చడంతో నేడు పులిని గుర్తించేందుకు సులభంగా మారింది. పులిని బంధించేందుకు మహారాష్ట్ర చెందిన ప్రత్యేక రెస్క్యూ టీమ్ పిలిపించారు. అడవిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు పులి ఎవరిపై దాడి చేయలేని ఎలాంటి ప్రయాణ నష్టం జరగలేదని ఇకముందు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా బంధిస్తామని స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు.