SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చివరి నిమిషంలో ట్విస్ట్.. సత్యసాయి జెడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్! అభినందించిన మంత్రి సవిత..

స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును జడ్పీ చైర్మన్ పదవికి ప్రకటించారు. దివంగత పరిటాల రవీంద్ర రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందిన పరిటాల శ్రీరామ్‌కు ఆ పదవి దక్కడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది కీలక పరిణామంగా మారింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 20, 2026, 20:31 IST | Updated: Nov 20, 2026, 20:43 IST
Image Credit: Paritala Sriram
Join

తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా పరిటాల రవి కొడుకు యువనేత పరిటాల శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, నూతన బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జెడ్పీ చైర్మన్ పదవికి సంబంధించి పలు ఊహాగానాలు వినిపించగా, వాటన్నింటికీ తెరదించుతూ పరిటాల శ్రీరామ్ పేరును ప్రకటించారు. ముఖ్యంగా పరిటాల రవీంద్ర రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందిన శ్రీరామ్‌కు ఈ పదవి దక్కడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచింది.

పరిటాల ప్రస్థానం..

పరిటాల కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పరిటాల రవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తండ్రి కూడా భూమిలేని రైతుల కోసం తనకున్న భూమిలో కొంత భాగాన్ని పంచినట్లు చాలామంది చెబుతారు. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో శ్రీరాములు హత్యకు గురైన విషయం తెలిసిందే.  ఆ తర్వాత రవి రాజకీయాల్లోకి వచ్చారు. 2005 లో అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ సమావేశానికి హాజరైన పరిటాల రవి బయటకు వస్తుండగా దుండగులు రవిని హత్య చేశారు. ఈ దాడితో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి నుంచి ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చారు. పరిటాల సునీత ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ నాయకురాలు. ప్రస్తుతం ఆమె రాప్తాడు శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.   ఇది పరిటాల కుటుంబంలో మరింత తీవ్ర విషాదాన్ని నింపింది. పరిటాల సునీత రవికి మేనమామ కూతురు. ఆమెనే వివాహం చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.

పలువురు సీనియర్ నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, అధిష్టానం అన్ని సమీకరణాలను పరిశీలించి చివరి నిమిషంలో పరిటాల శ్రీరామ్ పేరును ఖరారు చేసింది. పరిటాల రవీంద్ర రాజకీయ వారసుడిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆయన, అత్యంత కీలకమైన జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడం ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది.

ప్రధానంగా రవికి ఆ ప్రాంతంపై ఉన్న బలమైన పట్టు, ప్రజాదరణ ఈ ఎంపికకు కారణమైంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమాణస్వీకారంలో పరిటాల శ్రీరామ్ అత్యంత భావోద్వేగంతో బాధ్యతలు స్వీకరించారు. "నేను శ్రీ సత్యసాయి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అంటూ ఆయన భారత రాజ్యాంగం పట్ల తనకున్న నిజమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా చూడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. నల్లచెరువు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకే కృషి చేస్తానని, శ్రీ సత్యసాయి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇలా పరిటాల కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES