School Holidays: దసరా పండుగ సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు మరోసారి గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. సుమారు పన్నెండు నుంచి పదమూడు రోజుల పాటు దసరా సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు తిరిగి బడిబాట పట్టాల్సి ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో రానున్న ప్రత్యేక సందర్భాలు, ఎన్నికల వేళ విద్యాసంస్థలకు వరుస హాలీడేస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో దసరా సెలవుల ముగింపు తర్వాతి వారాంతపు రోజులు కలిసిరానుండగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కారణంగా విద్యార్థులకు, సిబ్బందికి అదనపు సెలవులు దక్కనున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా పాఠశాలలు మారుతాయో, ఆయా తేదీల్లో స్కూళ్లకు ప్రత్యేకంగా సెలవులు వర్తించనున్నాయి. తద్వారా విద్యార్థులకు చదువుతో పాటు మరోమారు విశ్రాంతి దొరికే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు పలు పాఠశాలలు, విద్యాసంస్థలను పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించనున్నారు. అదనంగా, ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్‌ను సులభతరం చేసేందుకు, సంబంధిత విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28 తేదీలలో రెండు రోజుల సెలవు మంజూరు చేసింది. ఈ సెలవుకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా జారీ చేసింది.
అయితే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ సెలవులు ఉంటాయని భావించకూడదు. సంబంధిత ఉత్తర్వుల ప్రకారం పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. పోలింగ్ జరిగే రోజు, అంటే అక్టోబర్ 28న, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉద్యోగులకు సెలవు ఇవ్వనుంది ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లను అక్టోబర్ 20 నుంచి 23వ తేదీ వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24న జరుగుతుంది, అక్టోబర్ 27న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జరిగి, నవంబర్ 5న ఫలితాలు ప్రకటిస్తారు. అయితే, ఎన్నికల సన్నాహాల్లో భాగంగా, పోలింగ్ కేంద్రాలుగా నిర్దేశించిన ప్రభుత్వ కార్యాలయాలు.. విద్యాసంస్థలు నవంబర్ 2న మూసివేసి ఉంటాయి. ఎన్నికలకు ముందు రోజు ఎన్నికల సామాగ్రి రవాణా, ఇతర ఏర్పాట్ల కారణంగా ఇది జరుగుతుంది.
నవంబర్ 3న పోలింగ్ జరిగే ప్రాంతాలలో, ఎన్నికల నిబంధనల ప్రకారం సెలవులు ఉంటాయి. నవంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో, కొంతమందికి వరుసగా మూడు రోజులు సెలవులు లభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం, మొదటి దశ పోలింగ్ నవంబర్ 26న, రెండవ దశ నవంబర్ 29న, మూడవ దశ డిసెంబర్ 2న జరుగుతుంది. ఈ ఎన్నికలకు ప్రభుత్వ పాఠశాలలను ఉపయోగించనున్నారు. అదనంగా, ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలుగా నిర్దేశించిన విద్యాసంస్థలు మూసివేసి ఉంటాయి. ముందస్తు పోలింగ్ ఏర్పాట్లు.. పోలింగ్ రోజు జరిగే కార్యక్రమాల ఆధారంగా ఆయా తేదీలలో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
మూడు దశల ఎన్నికలు వేర్వేరు తేదీలలో జరగనున్నందున, ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులకు వేర్వేరు సమయాల్లో సెలవులు లభించే అవకాశం ఉంది. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా పలు విద్యాసంస్థలకు నవంబర్ వరకు సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయని భావించనప్పటికీ, ఆయా పాఠశాలలు జారీ చేసిన అధికారిక ఉత్తర్వులను విద్యార్థులు తనిఖీ చేసుకోవాలి. తెలంగాణలోని స్కూళ్లకు అక్టోబర్ 22వ తేదీ వరకు దసరా సెలవులు ఉన్నాయి. విద్యాసంస్థలు అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం నాడు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే, కొన్ని పాఠశాలలకు శని, ఆదివారాల్లో సాధారణ సెలవులు ఉంటాయి. అటువంటి పాఠశాలల్లోని విద్యార్థులు శుక్రవారం సెలవు తీసుకుంటే, వారికి మరో మూడు రోజుల సెలవులు లభిస్తాయి. అక్టోబర్ 23, 24, 25 తేదీల మూడు రోజులు దసరా సెలవుల కిందకు వస్తాయి... వారు అక్టోబర్ 26 (సోమవారం) నుండి పాఠశాలకు తిరిగి రావచ్చు.
అయితే, ఈ మూడు రోజుల సెలవులు (అక్టోబర్ 23, 24, 25) అందరికీ వర్తించవు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 23న తిరిగి తెరుచుకుంటాయి... రెండు రోజుల సెలవు (శుక్రవారం, శనివారం) తర్వాత, ఆదివారం కూడా సెలవు ఉంటుంది. అయితే, చాలా మంది విద్యార్థులు అక్టోబర్ 26 (సోమవారం) నుండి పాఠశాలకు తిరిగి వస్తారని భావిస్తున్నారు.