SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP ZPTC MPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా నామినేషన్లు.. 'పరిషత్‌' పోరులో ఉత్కంఠ

TDP YSRCP Candidates Filed Nominations For ZPTC And MPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీల నుంచి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. రెండో రోజు ఏపీలో జోరుగా నామినేషన్లు జరిగాయి. వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 22, 2026, 09:04 PM IST | Updated: Oct 22, 2026, 09:12 PM IST
Image Credit: AP ZPTC MPTC Elections
Join

AP Local Body Elections: మున్సిపల్‌ కార్పొరేషన్‌, పంచాయతీ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో రాజకీయం హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా.. రెండో రోజు గురువారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీచేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు బరిలో నిలిచాయి. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. చాలా చోట్ల ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కాకినాడలో కాక రేపుతున్న రాజకీయం
కాకినాడ జిల్లాలో 401 ఎంపీటీసీలు, 20 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరు అందుకుంది. నామినేషన్ ల రెండవ రోజు మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జడ్పిటిసి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని కాకినాడ అర్బన్ మినహా మిగిలిన 20 మండలాల్లో ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. టిడిపి, జనసేన ,వైసీపీ నాయకులు నామినేషన్లు వేస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఎలాంటి హడావుడి కనబడడం లేదు. అయితే ఇప్పటి వరకు పొత్తులు తేలక పోవడంతో అన్ని స్థానాలకు టిడిపి, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. కలెక్టర్ హరేంధరప్రసాద్, ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో పోలీసులు నిరంతర నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు.

గన్నవరంలో..
కృష్ణాజిల్లా గన్నవరంలో రెండో రోజు ఎంపీటీసీ నామినేషన్ల జోరు కొనసాగుతోంది. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం స్థానిక ఎన్నికల ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. ఎర్రగాని రత్తయ్య ఇండిపెండెట్ అభ్యర్థి  కేసరపల్లి 1సెగ్మెంట్, శొంటి కిషోర్ కేసరపల్లి 3 సెగ్మెంట్ నామిషన్ దాఖలు చేశారు. ముస్తాబాద్ సెగ్మెంట్ 2కి ఎంపీటీసీ అభ్యర్థిగా కూటమి నుంచి  ఉమ్మడి రవికుమార్ నామినేషన్ సమర్పించారు. కొండపావులూరు, పురుషోత్తపట్నం, సోమరి గూడెం సెగ్మెంట్‌కి కూటమి నుంచి కానూరి శేషు మాధవి నామినేషన్ దాఖలు చేశారు.

తూ.గో జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికలకు రెండో రోజు జోరుగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. 21 జెడ్పీటీసీ స్థానాలకు తొలి రోజు 3 నామినేషన్లు రాగా.. రెండో రోజు 37 నామినేషన్లు వచ్చాయి. 412 ఎంపీటీసీ స్థానాలకు తొలి రోజు 200 మంది అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఇవాళ 428 మంది నామినేషన్లు వేశారు. రాజమండ్రిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ఘట్టం ప్రశాంత వాతావరణంలో 
కొనసాగుతోంది. ఎస్పీ నర్సింహ కిషోర్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటివరకు వచ్చిన నామినేషన్ల వివరాలు ఇలా 
తెలుగుదేశం పార్టీ: 13
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ: 13
జనసేన పార్టీ: 6
కాంగ్రెస్ పార్టీ: 2
బీజేపీ: 2
బహుజన సమాజ్ పార్టీ: 2

తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో కూటమి పార్టీల్లో ఎవరు దక్కించుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకట లక్ష్మి  సీతానగరం నుంచి జెడ్పీటీసీగా పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి అన్నిచోట్ల అభ్యర్థులను పోటీలో ఉంచడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. పార్టీ గుర్తులపై జరగనున్న తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో ప్రస్తుతం పట్టణాల్లో ఎన్నికల ప్రచారం వేడి తగ్గింది. పరిషత్ ఎన్నికల నామినేషన్ రేపు చివరి రోజు కావడంతో గ్రామాల్లో ఎన్నికలు వేడి పెరిగింది.

వైఎస్సార్‌సీపీలో చేరికలు
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పిఠాపురంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. టీడీపీ మాజీ ఎంపీటీసీ, చిత్రాడ గ్రామ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగా గీత సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కూటమి ప్రభుత్వంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వంగా గీత విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 22 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీని గెలుపునకు విజయం చేకూరేలా కలిసికట్టుగా అందరూ కృషి చేయాలని వంగ గీత సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES