SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. అప్‌డేట్‌ ఏమిచ్చారంటే?

TTD Announces 10 Days Vaikunta Dwara Darshan To Devotees: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధి పొందిన వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. మొత్తం ఎన్ని రోజులు దర్శనాలు ఉంటాయి? దర్శనాలకు ఎలా బుక్‌ చేసుకోవాలో వంటి వివరాలు వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 19, 2026, 00:14 IST | Updated: Nov 19, 2026, 00:17 IST
Image Credit: Tirumala Vaikunta Dwara Darshan
Join

Tirumala Vaikunta Dwara Darshan: తిరుమలలో కొలువుదీరిన ఆపద మొక్కులవాడు వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం ప్రకటించింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని.. మొత్తం పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర ప్రకటించారు.

డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు కల్పిస్తామని రవిచంద్ర తెలిపారు. తిరుమలలో బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతేడాది వైకుంఠ ద్వార దర్శనాలను 7.45 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా.. ఈసారి గతేడాది కంటే అధికంగా మరో 51 వేల మందికి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర వివరించారు. ఉత్తర ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులు డిప్ విధానం ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తామని.. మిగతా ఏడు రోజులు సర్వదర్శనం గుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర తెలిపారు.

ఇక తిరుమల, తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించగా.. వాటి వివరాలను కూడా టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర వెల్లడించారు. తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్ షిప్‌ను రూ.2,750 కోట్లతో నిర్మాణనికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమల, తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచేందుకు నిర్ణయం తీసుకోగా.. శ్రీవారి ఆలయంలో నెయ్యి ఉత్పత్తికి రూ.7.7 కోట్లతో 500 ఆవులు కొనుగోలు చేస్తామని చైర్మన్‌ వివరించారు.

తిరుమల, తిరుపతిలో వన్యప్రాణుల సంరక్షణకు రెండేళ్ల కాలానికి సంబంధించి రూ.16.4 కోట్లు నిధులు కేటాయించాం. శ్రీవారి మెట్లకు వెళ్లే రోడ్డు మార్గం అభివృద్ది చేస్తాం. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల బహుమానంగా రూ.16,940 అందిస్తామని చెప్పారు. వాటిలో సగం నిధులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తాం' అని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రవిచంద్ర వివరించారు. ఇక వేద పారాయణదారులతోపాటు ప్రబంధం చేసే వారి వేతన పెంచుతామని ప్రకటించి వారి కుటుంబాల్లో ఆనందం నింపారు.

ఇతర నిర్ణయాలు
స్విమ్స్ ఆస్పత్రిలో పరికరాల బకాయిలకు రూ.41.2 కోట్లు నిధులు విడుదలకు నిర్ణయం
స్విమ్స్‌లో మరింత వైద్య సేవలను పెంపొందించేందుకే నిర్ణయం
శిల్ప కళాశాలలో హాస్టళ్లలో సౌకర్యాలకు రూ.23 కోట్లు కేటాయింపు
టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లు నిధులు కేటాయింపు
టీటీడీ ఉద్యోగులు ఖర్చుగా రూ.80 కోట్లు కేటాయింపునకు నిర్ణయం

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES