SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sarva Darshan: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. శ్రీవారి దర్శనానికి 4 గంటలు మాత్రమే!

Tirumala Sarva Darshan Time Only 4 Hours: కలియుగ వైకుంఠ వాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి తగ్గింది. దీంతో శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ సమయం పట్టేస్తోంది. బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సమయంలోనే దర్శన సమయం తగ్గడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Reported By Ravi Kumar Sargam Written By Ravi Kumar Sargam
Published: Sep 22, 2026, 03:06 PM IST | Updated: Sep 22, 2026, 03:14 PM IST
Image Credit: Zee Telugu News Youtube
Join

Tirumala Rush Down: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు వెంట వెంటనే దర్శనం కలుగుతోంది. 3 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్‌లు నిండిపోగా.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం దర్శన సమయం 4 గంటలు పడుతోంది. శ్రీవారిని సోమవారం 65,223 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,112 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు రాగా.. లడ్డూ విక్రయాలు 4.29 లక్షలు అమ్ముడుపోగా.. 1.81 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.

ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవితోపాటు సినీ నటి డింపుల్ హయతి తిరుమల స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వారిద్దరూ స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారు రథంపై కొలువుదీరి నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో డాక్టర్‌ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ, పోలీసు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నాలుగు మాడవీధుల్లో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ రథోత్సవాన్ని సజావుగా నిర్వహించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES