SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala: తిరుమల కొండపై మరోసారి చిరుత సంచారం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు..

Leopard spotted in Tirumala: కొద్దిసేపు టోల్‌గేట్ సమీపంలోనే సంచరించిన ఆ చిరుత, అనంతరం పక్కనే ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కాలినడకన వెళ్లే భక్తులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 14, 2026, 01:46 PM IST | Updated: Sep 14, 2026, 01:52 PM IST
Image Credit: tirumalanews(file)
Join

Leopard spotted near gnc tollgate in Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్దం చేసింది. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు సామాన్య భక్తులే తొలి ప్రాధాన్యతగా టీటీడీ.. సెప్టెంబరు 15 నుంచి 23వరకు వీఐపీ దర్శనాలు, ప్రివీలేజ్ దర్శానాలు రద్దు చేసింది. ఇక ఎస్ఎస్ డీ ,దివ్యదర్శనం టోకెన్ల జారీని కూడా నిలిపివేశారు. కేవలం సర్వదర్శనం మార్గంలో భక్తులకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. అయితే.. తిరుమలలో ఇటీవల చిరుత పులి సంచారం భక్తులకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.

తిరుమల కొండపై చిరుత సంచారం మరల చిరుత సంచారం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి వేళ తిరుమలలోని జీఎన్సీ (GNC) టోల్‌గేట్‌కు అత్యంత సమీపంలో చిరుతపులి వచ్చింది. అక్కడ కొద్ది సేపు తిరిగి మరల అడవుల్లోకి వెళ్లిపోయింది. 

దీంతో ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. వెంటనే టీటీడీకి సమాచారం అందించారు. టీటీడీ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అక్కడ  గస్తీ కాశారు.  

అయితే.. బ్రహ్మోత్సవాల వేళ.. ఘాట్ రోడ్లు, నడకదారుల పరిసరాల్లో తరచూ క్రూరమృగాలు సంచరిస్తున్న నేపథ్యంలో భక్తులు అలర్ట్ గా ఉండాలని, గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అటవీ శాఖ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES