SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Tirumala Donation: తిరుమల ఆలయానికి తెలంగాణ భక్తుడి రూ.10 కోట్ల భారీ విరాళం

Rs 10 Crore Donation To Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్త జనం పోటెత్తుండగా.. అదే స్థాయిలో విరాళాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమల ఆలయానికి తెలంగాణ భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. టీటీడీ అన్నదానం ట్రస్టుకు రూ.10 కోట్లు విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 13, 2026, 09:48 PM IST | Updated: Nov 13, 2026, 09:53 PM IST
Image Credit: Tirumala Rs 10 Crore Donation
Join

Tirumala Annaprasadam Trust Donation: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అదే స్థాయిలో స్వామివారికి కానుకలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తిరుమల స్వామి ఆలయానికి భారీగా విరాళం అందించాడు. తిరుమలలోని అన్నప్రసాద ట్రస్టుకు ఏకంగా రూ.10 కోట్లు విరాళం అందించారు. స్వామివారికి భారీ విరాళం అందించిన ఆ భక్తుడు ఎవరో తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం అందించే పవిత్ర సేవకు భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు కొడాలి శ్రీకాంత్ టీటీడీకి రూ.10 కోట్లు విరాళంగా అందించారు. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించగా.. టీటీడీ అధికారులు స్వీకరించారు. నిత్యం వేలాది మంది భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాద సేవకు ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించడం విశేషంగా నిలిచింది. శ్రీవారి సేవలో దాతల భాగస్వామ్యం మరోసారి చాటిచెప్పేలా ఈ విరాళం నిలిచింది.

తిరుమల క్షేత్రంలో అన్నదానం అత్యంత పవిత్రమైన సేవగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ నిత్యం అన్నప్రసాదాన్ని అందిస్తోంది. ఈ సేవ నిరంతరాయంగా కొనసాగేందుకు భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందిస్తున్న క్రమంలో హైదరాబాద్‌కు చెందిన  కొడాలి శ్రీకాంత్ కూడా భారీ విరాళాన్ని అందించారు. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఈ మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. అన్నప్రసాదం ట్రస్టుకు అందిన ఈ విరాళం భక్తుల ఆకలి తీర్చే సేవకు దాతల నుంచి లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. విరాళం అందించేందు ముందు దాత కుటుంబసభ్యులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సౌకర్యాల పరిశీలన
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై టీటీడీ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి మాధవ నిలయం (పీఏసీ-2) నుంచి జీఎన్‌సీ టోల్ గేట్ వరకు కాలినడక భక్తులు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. భక్తులకు దర్శనం, ఉచిత వసతి వివరాలు అందుబాటులో ఉండేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఈఓ వెంకయ్య చౌదరి ఆదేశించారు. తాగునీరు, ఆహార పదార్థాలను నిర్ణీత ధరలకే విక్రయించాలని.. ఆక్రమణలకు తావులేకుండా చూడాలని సూచించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులపై ఈఓ వెంకయ్య చౌదరి సమీక్షించారు.

శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా ప్రభుదేవా
తిరుమల శ్రీవారిని సాయంత్రం పూట ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, నటుడు జాక్సన్ ప్రభుదేవా దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు చేరుకున్న ప్రభుదేవా కుటుంబానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల, కాళహస్తీశ్వర సేవలో హీరోయిన్లు
తిరుమల శ్రీవారిని శుక్రవారం సాయంత్రం సుప్రభాత సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరీ ప్రియ పాల్గొన్నారు. తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని సినీ నటి శ్రీలీల సందర్శించి కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES