• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Hemanth Health Update: రాప్తాడు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత.. కర్నూలుకు తరలింపు

Hemanth Health Update: రాప్తాడు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత.. కర్నూలుకు తరలింపు

Raptadu Incident Accused Hemanth Health Condition: పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతున్న అతడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతుండడంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 13, 2026, 11:14 PM IST|Updated: Nov 13, 2026, 11:21 PM IST
joinshare
Hemanth Health Update: రాప్తాడు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత.. కర్నూలుకు తరలింపు
Image Credit: Raptadu Incident Accused Health Condition

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Hemanth Health Update: రాప్తాడు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత.. కర్నూలుకు తరలింపు

Hemanth Health Update: రాప్తాడు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత.. కర్నూలుకు తరలింపు

2

Dil Raju: పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. ఐదు సినిమాల లైనప్ ఇదే!

3

Traffic Diversions: హైటెక్‌ సిటీ ప్రాంతంలో హైఅలర్ట్‌.. రేపు హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ మళ్లింపు

4

Tirumala Donation: తిరుమల ఆలయానికి తెలంగాణ భక్తుడి రూ.10 కోట్ల భారీ విరాళం

5

Revanth Reddy: బీఆర్‌ఎస్‌, బీజేపీపై రేవంత్ రెడ్డి ఆగ్రహం.. భారత్‌ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ వస్తే విమర్శిస్తారా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Accused Hemanth Condition: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన రాప్తాడు పాఠశాల నిందితుడు హేమంత్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి శ్వాస ప్రక్రియకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రి వైద్యులు కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. అయినా కూడా అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందని తెలుస్తోంది.

అనంతపురం జిల్లా రాప్తాడులోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో బాలికను రంపంతో హత్యాయత్నానికి పాల్పడిన హేమంత్ అనంతపురంలోని ఆస్పత్రిలో 13 రోజులుగా చికిత్స పొందుతుండగా శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం వైద్యులు అతడిని కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతడు పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణకు ఆటంకం కలిగించే ఒక తీవ్రమైన సమస్య)తో బాధపడుతుండగా.. శ్వాసక్రియకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రెండు రోజులుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గోపికపై అక్టోబర్‌ 31వ తేదీన హేమంత్ (21) మొద్దులు కోసే రంపం మిషన్‌‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. తరగతి గదిలో రంపంతో దాడి చేయగా బాలిక గోపిక తీవ్ర గాయాలపాలవగా.. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని గాయపడింది. దాడిలో ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలైన బాధితురాలు బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఈ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న హేమంత్‎ను పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడికి దిగడంతో పోలీసులు అతడిపై ఎదురుకాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌ను అనంతపురం ఆస్పత్రిలో చేర్పించగా.. అయితే చికిత్సలో భాగంగా తీవ్ర గాయమవడంతో అతడి కాలు తొలగించారు. ఇప్పుడు అస్వస్థతకు గురవగా అతడు కర్నూలులోని ఆస్పత్రిలో కొన ప్రాణంతో ఉన్నాడు.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Telugu News
AP News