Vaikunta Dwara Darshan: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల తేదీలు వచ్చేశాయి.. ఎప్పుడంటే?
Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠవాసుడిని వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు. అంతటి భాగ్యం కలిగించే వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్‌లో జరగనున్నాయి. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల గురించి అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. దర్శన టికెట్లు, దర్శన సమయాలకు సంబంధించి ఇలా ప్రచారం జరుగుతోంది.
Tirumala Vaikunta Dwara Darshan 2026: కలియుగ వైకుంఠవాసుడిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం అంటే అది ఎంతటి అదృష్టం ఉండాలి. వైకుంఠ ద్వారం నుంచి వైకుంఠవాసుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. వైకుంఠ ఏకాదశి డిసెంబర్‌లో రానుండగా.. ఉత్తర ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వారం నుంచి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు టీటీడీ సామాన్య భక్తులకు కూడా అవకాశం కల్పిస్తోంది. అందులో భాగంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. వాటికి బుక్ చేసుకునే తేదీలను ఇలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైకుంఠ ద్వార దర్శనాలు అంటే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుండగా.. వాటికి సంబంధించిన దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను రేపో మాపో టీటీడీ విడుదల చేయనుంది. ఉత్తర ద్వారా దర్శనాల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రోజుకు 15 వేల చొప్పున మొత్తం లక్షా 20 వేల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు డిసెంబర్ 26వ తేదీన దర్శనం కల్పించే అవకాశం ఉంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లేని సర్వదర్శనం భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎలక్ట్రానిక్ డిప్‌లో దర్శనం అవకాశం పొందిన భక్తులకు మూడు రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. డిప్‌కు సంబంధించి నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనుందని సమాచారం. నవంబర్ 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటలకు డిప్‌లో రిజిస్ట్రేషన్‌కు టీటీడీ అవకాశం కల్పిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డిప్‌లో రిజిస్ట్రేషన్ పొందిన భక్తులకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీన దర్శన టోకెన్లు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇక వైకుంఠ ద్వార దర్శనం వీవీఐ ప్రత్యేక దర్శనానికి సంబంధించి రూ.300 టికెట్లు డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజుకు 15 వేల దర్శనం టికెట్లు కేటాయించనుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు శ్రీవాణి దర్శనం టికెట్లు డిసెంబర్ 5వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారని సమాచారం. రోజుకు వెయ్యి చొప్పున ఈ టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఈ దర్శనాలకు సంబంధించి టీటీడీ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబర్ 20 నుంచి 29 వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరగనుండగా.. భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.