89 అడుగుల దివ్య కంకణ మహాగణపతి.. కోటి మట్టి గాజులతో అలంకరణ..
Divya Kankana Maha Ganapathi: శాఖపట్నం లోని గాజువాకలో ప్రతిష్టించిన దివ్య కంకణ మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ గణపతిని కోటి మట్టి గాజులతో అలంకరించారు. అంతేకాకుండా ఈ వినాయకుడు దాదాపు 89 అడుగుల ఎత్తు ఉండడం విశేషం.. ఈ వినాయకుడికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Visakhapatnam News: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల వేళ విశాఖపట్నంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఏటా వినూత్న రూపాయలతో భక్తులను ఆకట్టుకునే విశాఖ ఉత్సవ కమిటీ ఈసారి మరింత అద్భుతమైన రీతిలో గణనాథుడిని ప్రతిష్టించారు. గాజువాక కేంద్రంగా ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటో తెలుసా? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
89 అడుగుల ఎత్తు..
గాజువాకలో ఏకంగా 89 అడుగుల భారీ ఎత్తులో శ్రీ దివ్య కంకణ అలంకరణ మహాగణపతిని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు.. ఈ విగ్రహానికి సంబంధించిన ప్రధాన విశేషం ఏమిటంటే.. ఈ లంబోదరుడి అలంకరణ కోసం ఏకంగా కోటి మట్టి గాజులను వినియోగించారట.. ఇంత భారీ స్థాయిలో గాజులతో వినాయకుడిని అలంకరించడం విశాఖ నగరంలో సరికొత్త రికార్డుగా నిలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ నుంచి గాజులు..
ఈ మహాగణపతి తయారీ కోసం నిర్వాహకులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నుంచి ప్రత్యేకంగా రంగురంగుల మట్టి గాజులను తెప్పించారు.. ఆకుపచ్చని రంగుతో పాటు గులాబీ పసుపు మెరూన్ తదితర అద్భుతమైన రంగుల గాజులను మాత్రమే ఈ వినాయకుడి తయారీలో వినియోగించారట.. పర్యావరణానికి హాని కలగకుండా పూర్తిగా సహజ సిద్ధమైన మట్టి గాజులనే వాడటం ఈ రూపకల్పనలోని మరో ప్రత్యేకత.. ప్రతి రంగు గాజును నిర్దిష్టమైన రీతిలో పేర్చుట స్వామివారి ఆభరణాలతో పాటు వస్త్రాదరణ తలపించేలా అద్భుతంగా లంబోదరుడిని తీర్చిదిద్దారు..
ప్రముఖ శిల్ప కళానిపుణులు ఆరిపాక కృష్ణ ఆధ్వర్యంలో వందలాదిమంది కళాకారులు, శ్రామికులు రాత్రి పగలు శ్రమించి ఈ భారీ ప్రతిమకు జీవం పోశారు.. ఎత్తైన విగ్రహంపై ప్రతి అంగుళాన్ని గాజులతో ఎంతో అందంగా అమర్చడం కళాకారుల ప్రతిభకు అర్థం పడుతోంది. ఎండ వేళల్లో.. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల కాంతులతో ఈ గాజుల విగ్రహం నుంచి వచ్చే వెలుగులు భక్తులకు కనువిందు చేస్తాయి..
ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...
ఈ అద్భుతమైన దివ్య కంకణ అలంకరణ మహాగణపతిని దర్శించుకునేందుకు విశాఖ నగరవాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు. భక్తుల రద్దీ దృశ్య ఉత్సవ కమిటీతోపాటు స్థానిక పోలీసుల ప్రత్యేకమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారట. ప్రతి ఏడాది లాగా ఈ సంవత్సరం కూడా ఇక్కడికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉండడంతో ఉత్సవ కమిటీ ప్రత్యేకమైన క్యూలైన్లను కూడా ఏర్పాటు చేసింది..
ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..