Samakhya Global Business Meet: హైటెక్స్‌లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’కు సర్వం సిద్ధం..
Samakhya Global Business Meet 2026: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’కు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న ఈ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.
Samakhya Global Business Meet 2026: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల విస్తరణతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SCC) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ సదస్సును నిర్వహించనున్నారు. అంతర్జాతీయ వ్యాపార సదస్సు అక్టోబర్ 14, 15వ తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. అక్టోబర్ 14న ఉదయం 10:30 గంటలకు సీఎం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ను అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే రోజు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ కూడా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:00 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశానికి పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు ఇవే..
అంతర్జాతీయ భాగస్వామ్యాలు: దేశ, విదేశీ సంస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు, పెట్టుబడులను ఆకర్షించడం, నూతన మార్కెట్ల అన్వేషణ ప్రధాన అజెండాగా ఈ సదస్సు సాగనుంది.
స్టార్టప్‌లు, MSME లకు ఊతం: ఎంఎస్ఎంఈలు, నూతన స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక వేదికను కల్పించనున్నారు. దక్షిణ
నూతన అవకాశాలు: పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ద్వారా దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక ప్రగతికి సరికొత్త మార్గాలు సుగమం అవుతాయని నిర్వాహకులు తెలిపారు.
ముంబైలో సన్నాహక సదస్సు..
ఇటీవల ముంబైలో ఓ ప్రముఖ హోటల్‌లో ‘సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్’ సన్నాహక సదస్సు నిర్వహించారు. గ్లోబల్ బిజినెస్ మీట్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ రావు నాయక్, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సదస్సు సన్నాహక సమావేశంలో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు టీవీఎన్ రావు, పీవీ రావు, ఏవీ రత్నం, తోట చంద్రశేఖర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వేలాది మంది ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు భాగస్వాములు కానున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్లు, ఇతర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. దక్షిణ భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఈ సదస్సు నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.