Revanth Reddy Controversial Statements: పరమశివుడు పేదోళ్లకు..శ్రీరాముడు ధనికులకు దేవుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా దేవుళ్లను విభజించి పాలించడంపై బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్‌కు లెఫ్ట్ రైట్ ఇచ్చుకున్నాడు. తాజాగా కిషన్ రెడ్డి.. రేవంత్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.
Tomorrow Govt Employees Likely To Get Bumper Gift From Telangana Govt: చర్చలు, కమిటీలతో ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడం.. సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండడంతో రేపు ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం జరగనుండగా.. ఆ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Army Engineers For Kaleshwaram SLBC: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటీల్.. ఆర్మీ చీఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియతో పాటు అత్యంత క్లిష్టమైన ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ తవ్వకం పనుల పర్యవేక్షణకు ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవడంపై జీ తెలుగు న్యూస్ బిగ్ డిబేట్ విత్ భరత్ కార్యక్రమంలో ఎడిటర్ శ్రీ భరత్ కీలక చర్చలు జరిపారు. అంతేకాకుండా, తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఎత్తు పెంపు, రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ, జలసంఘం అనుమతులు సాధించడంపై లోతుగా విశ్లేషించారు.
Cm Revanth reddy sircilla tour: సిరిసిల్ల పర్యటకు సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై నిఘా పెంచారు. మరోవైపు కేటీఆర్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో కేరళలోకి కోచ్చికి ఇండియాటుడే కాంక్లెవ్ కోసం వెళ్లారు.
Minister seethakka key announcement: మహిళలు చదువుకుంటే వారికి మరిన్ని ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. విద్య అనేది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. అందుకే అక్కచెల్లెమ్మలంతా 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
Konda Surekha fires on congress leaders: నా వెనుక నిలబడిన మహిళలు ఒక్కొక్కరు నలుగురిని కొడతారంటూ మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికి మంచిదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
cm Revanth reddy in delhi visit: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తొంది. అయితే ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీపై విమర్శలు చేస్తు రేవంత్ శ్రీరాముడు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Telangana Inter Board Merger: తెలంగాణ విద్యా వ్యవస్థలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న వేర్వేరు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థలను తొలగించి.. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది.
ULC Lands: తెలంగాణ ప్రభుత్వ భూములపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ లండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం లభించింది.మొత్తంగా ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
kavitha responds on the paradise movie song: నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల రిలీజైన ది ప్యారడైజ్ మూవీ ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా వినాయక నిమజ్జనం వేళ ఈ మూవీలోని పాటలే ఎక్కడ చూసిన విన్పిస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Khairatabad By poll: దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో...ఖైరతాబాద్ ఉప ఎన్నికకు అంతా రెడీ అయ్యింది. దీంతో ఖైరతాబాద్ బై పోల్ పై అన్ని పార్టీలు నజర్ పెట్టాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.
Telangana Cabinet Expansion Late: కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణలో మూడు క్యాబినేట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దసరా వరకు ఖాళీగా ఉన్న వాటిని సామాజిక సమీకరణాల దృష్ట్యా భర్తీ చేసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పటికే క్యాబినేట్‌లో ఉన్న ఒకరిద్దరిని తొలిగించి వారి ప్లేస్‌లో కొత్త వారిని తీసుకొవాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్యాబినేట్ విస్తరణ డిసెంబర్‌కు వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి.దీంతో క్యాబినేట్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు జల్లినట్టైయింది.
The paradise Congress vs BRS: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలిన పాత్రను ఎంతో పాజిటివ్‌గా చూపించారనే అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి.
Harish rao fires on cm revanth redddy govt: మల్లన్న సాగర్ నిండుకుండలా మారితే హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు, మీరు చెబుతున్న మూసీ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లోనూ 15 టీఎంసీలకు కేవలం 6 టీఎంసీలే ఉన్నాయని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Ganesh Immersion in Telangana: తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వినాయక నిమజ్జనంను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు సెలవు దినంగా ప్రకటిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Nani Request to CM Revanth Reddy: నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రదర్శించనునున్నారు. ఈ నేపథ్యంలో నాని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసేందకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు.
KCR Assets: తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదం దుమారం రేపుతోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భూ గణాంకాలు వెల్లడించిన తర్వాత రాజకీయంగా హీటెక్కింది. కేసీఆర్ కుటుంబానికి ఉన్న భూ వివరాలపై ఆసక్తికర చర్చసాగుతోంది. రాజకీయ ప్రముఖుల్లో ఎవరెవరు ఎంతమేర భూములు సంపాదించారనే అంశంపై సవాళ్లు విసురుతున్నారు? రాజకీయాల్లోకి రాకముందు ఉన్న భూములెంత? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని భూములున్నాయనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు భూములు ఎలా సంపాదించారు? రాజకీయాలు ఆర్థిక వనరులు సమకూరుస్తాయా? రాజకీయ నాయకుల భూ వివాదాలపై జీ తెలుగున్యూస్ స్పెషల్…!!
Ganesh immersion row on tank bund: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లు పీకివేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Danam nagender disqualification Row: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ, బీఆర్ఎస్ లు దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంను స్వాగతిస్తున్నాయి . దీనిపై తెలంగాణలో ఖైరతాబాద్ బైపోల్ పై హాట్ గా చర్చలు జరుగుతున్నాయి.