SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kwala Intel: స్టాక్ మార్కెట్ రీసెర్చ్‌లో ఏఐ విప్లవం.. రోజుకు రూ.4 ఖర్చుతోనే స్టాక్ మార్కెట్ రీసెర్చ్..!

Kwala Intel: స్టాక్ మార్కెట్‌లో టెలిగ్రామ్ పుకార్లు, సోషల్ మీడియా అన్‌వెరిఫైడ్ చిట్కాలపై ఆధారపడి వేలాది రూపాయలు నష్టపోతున్న రిటైల్ ఇన్వెస్టర్లకు సాంకేతికత అండగా నిలవనుంది. కృత్రిమ మేధ ఆధారిత మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘క్వాలా ఇంటెల్’ (Kwala Intel) ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ ఫండమెంటల్స్, టెక్నికల్ చార్ట్‌లు, వ్యాల్యుయేషన్లను క్షుణ్ణంగా విశ్లేషించి వినియోగదారుల సొంత భాషలోనే స్పష్టమైన సమాధానాలు అందించనుంది.

Written By Ashok Krindinti
Published: Oct 14, 2026, 04:05 PM IST | Updated: Oct 14, 2026, 04:07 PM IST
Image Credit: Kwala Intel
Join

Kwala Intel: స్టాక్ మార్కెట్‌లో లాభాలు ఆర్జించాలన్నా.. నష్టాల బారిన పడకుండా ఉండాలన్నా పక్కా సమాచారంతో కూడిన సరైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. అయితే ప్రస్తుతం చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సోషల్ మీడియా గ్రూపులు, టెలిగ్రామ్ ఛానెళ్లలోని అన్‌వెరిఫైడ్ టిప్స్, పుకార్లు లేదా ఊహాగానాలపై ఆధారపడి ఇన్వెస్ట్ చేస్తూ.. భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. కచ్చితమైన డేటా ఆధారిత స్టాక్ అనాలిసిస్, ఆర్థిక సమాచారాన్ని అందించడానికి కృత్రిమ మేధ ఆధారిత మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘క్వాలా ఇంటెల్’ (Kwala Intel) భారత్‌లో తన సేవలను ప్రారంభించింది.

అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NYSE), నాస్‌డాక్ (Nasdaq) మార్కెట్లలో వాల్‌స్ట్రీట్ ఇన్వెస్టర్లకు సేవలు అందించిన ఈ ఏఐ ప్లాట్‌ఫారమ్.. ఇప్పుడు భారతీయ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులోకి వచ్చింది.

క్వాలా ఇంటెల్ అంటే ఏమిటి..?

క్వాలా ఇంటెల్ అనేది స్టాక్ మార్కెట్ సంబంధిత సమాచారం కోసం పనిచేసే ఒక ప్రత్యేక ‘ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్’. సాధారణంగా ఒక స్టాక్ గురించి తెలుసుకోవడానికి అనేక వెబ్‌సైట్లు, చార్ట్‌లు, ఆర్థిక నివేదికలను శోధించాల్సి వస్తుంది. కానీ ఈ ప్లాట్‌ఫారమ్‌లో నేరుగా మీ సందేహాలను మీ సొంత భాషలోనే ప్రశ్నల రూపంలో అడిగి, సరళమైన, స్పష్టమైన సమాధానాలు పొందవచ్చు. ఒక కంపెనీ వ్యాల్యుయేషన్, వృద్ధి అవకాశాలు, సాంకేతిక మార్పులు లేదా మీ పోర్ట్‌ఫోలియో స్థితిగతులపై నేరుగా ప్రశ్నలు సంధించవచ్చు.

కీలక ఫీచర్లు, ఉపయోగాలు..

టెక్నాకల్ అనలాసిస్: ఇంట్రాడే, స్వింగ్ ట్రేడర్లకు ఉపయోగపడేలా చార్ట్ ప్యాటర్నులు, టెక్నికల్ ఇండికేటర్లు, మార్కెట్ కదలికలను సులభంగా విశ్లేషిస్తుంది.
ప్రాథమిక విశ్లేషణ: దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం కంపెనీ వ్యాపార నమూనా, త్రైమాసిక/వార్షిక ఆదాయాలు, వృద్ధి సామర్థ్యం, వ్యాల్యుయేషన్ వంటి కీలక ఫండమెంటల్స్‌ను విశ్లేషించి పెట్టుబడికి అనుకూలమో కాదో వివరిస్తుంది.
పోర్ట్‌ఫోలియో రీసెర్చ్: వివిధ కంపెనీల షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు తమ మొత్తం హోల్డింగ్స్ మరియు వ్యక్తిగత స్టాక్‌ల పనితీరును నేరుగా సమీక్షించుకునే వెసులుబాటు కల్పిస్తుంది.
ఏఐ చాట్: సాంకేతికతతో కూడిన సంక్లిష్టమైన మార్కెట్ అంశాలపై డైరెక్ట్ ప్రశ్నల ద్వారా విశ్లేషణలు అందిస్తుంది.

క్వాలా ఇంటెల్‌ను ఎలా ఉపయోగించాలి..?

ముందుగా అధికారిక వెబ్‌సైట్ kwalaintel.com/in ని సందర్శించాలి.
app.kwalaintel.com/in/signin ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.
సెర్చ్ బార్‌లో మీరు విశ్లేషించాలనుకుంటున్న స్టాక్ పేరు లేదా ఇండెక్స్‌ను ఎంటర్ చేయాలి.
మీ ప్రశ్నను అడగాలి (ఉదాహరణకు: “ఈ కంపెనీ వ్యాల్యుయేషన్ ఎంత?”, “చూడాల్సిన ముఖ్యమైన ఫండమెంటల్స్ ఏవి?”, లేదా “చార్ట్‌లో ఎలాంటి టెక్నికల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి?”).
ఏఐ ఇచ్చిన సమాధానాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని, వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాతే ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

నెలకు కేవలం రూ.199 మాత్రమే..!

ఈ ఏఐ ఆధారిత రీసెర్చ్ టూల్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు నెలకు కేవలం రూ.199 గా నిర్ణయించారు. అంటే రోజుకు దాదాపు రూ.4 కంటే తక్కువ ఖర్చుతోనే వినియోగదారులు  అన్‌లిమిటెడ్ ఏఐ చాట్ యాక్సెస్‌ను పొందవచ్చు. సామాన్య ట్రేడర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ఖర్చుతో ప్రొఫెషనల్ స్థాయి రీసెర్చ్ సదుపాయాన్ని పొందడానికి ఇది ఎంతో ఉపయోగకరం.

సెబీ కీలక నివేదిక..!

మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI) వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. దలాల్ స్ట్రీట్ ఈక్విటీ డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ & ఆప్షన్స్ - F&O) విభాగంలో ట్రేడింగ్ చేస్తున్న వ్యక్తిగత ట్రేడర్లలో ఏకంగా 87.7 శాతం మంది (ప్రతి పది మందిలో దాదాపు తొమ్మిది మంది) తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వీరు ఏడాదికి సగటున రూ.1.17 లక్షల వరకు నష్టపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్షణాల వ్యవధిలో జరిగే తొందరపాటు నిర్ణయాలు భారీ నష్టాలకు దారితీస్తున్న తరుణంలో, డేటా ఆధారిత విశ్లేషణలను అందించే క్వాలా ఇంటెల్ వంటి టూల్స్ నష్టాలను అరికట్టడంలో సహాయపడతాయి.

ఎవరికి ఉపయోగం..

ఇంట్రాడే & స్వింగ్ ట్రేడర్లు: చార్ట్‌లు, ప్యాటర్న్లు, టెక్నికల్ సూచికలపై స్పష్టత కోసం.
దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు: పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ వ్యాల్యుయేషన్, వృద్ధిని లోతుగా అధ్యయనం చేయడానికి.
పెద్ద పోర్ట్‌ఫోలియో ఉన్నవారు: తమ వద్ద ఉన్న షేర్ల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించుకోవడానికి.
కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారు: మార్కెట్ పదజాలం, కంపెనీ ఆర్థిక అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి.

బాధ్యతాయుతమైన పెట్టుబడే ముఖ్యం..!

ఏఐ టెక్నాలజీ స్టాక్ మార్కెట్ రీసెర్చ్‌ను సులభతరం చేస్తున్నా.. ఏ కృత్రిమ మేధ సాధనమూ పెట్టుబడిదారుడి స్వతంత్ర నిర్ణయాధికారానికి ప్రత్యామ్నాయం కాలేదు. క్వాలా ఇంటెల్ అనేది సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చే ఒక సమర్థవంతమైన సహాయక సాధనం మాత్రమే. వినియోగదారులు స్వీయ పరిశోధన, సరైన అంచనాలతో కూడిన బాధ్యతాయుతమైన పెట్టుబడి విధానాన్ని అనుసరించినప్పుడే మార్కెట్లో విజయవంతం కాగలరు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES