Vishwambhara Vs Kaakaa: చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' రిలీజ్ డేట్ చుట్టూ పెద్ద హై డ్రామా నడస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది మార్చికి పోస్ట్‌పోన్ అయిందన్న వార్తల మధ్య ఓటీటీ డీల్ కోసం సంక్రాంతి బరిలోనే దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు బాబీ ఈ ‘కాకా’ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ‘విశ్వంభర’ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. ఇన్నాళ్లు ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి ఓటీటీ డీల్ కాకపోవడమే అన్న టాక్ నడిచింది. రీసెంట్గా ఆ పని పూర్తైయింది. దీంతో 'కాకా'ను సమ్మర్‌కు నెట్టేసి.. బాక్సాఫీస్ బరిలో 'విశ్వంభర'నే సంక్రాంతి రేులో దించబోతున్నట్టు తెలుస్తుంది.
విశ్వంభర రిలీజ్ డేట్ పై పూటకో వార్త..
విశ్వంభర రిలీజ్ డేట్‌పై రోజుకో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా మార్చి 2027కి వెళ్లిందనేది టాక్. కానీ ఓటీటీ బిజినెస్ ఇప్పటికే భారీ మొత్తానికి ఓకే అయిపోయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లోపు రిలీజ్ చేస్తేనే ఈ అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లిస్తారట. లేదంటే డీల్ క్యాన్సిల్ అవుతుందనే రూల్ ఇప్పుడు మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారింది.
‘కాకా’ మీదున్న చిరు కొత్త సినిమా..
మరోపక్క చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ షూటింగ్ కూడా చక చకా జరిగిపోతుంది. ఈ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 13నే విడుదల చేస్తున్నట్టు ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఒకే సీజన్లో ఒకే హీరో సినిమాలు క్లాష్ అవ్వడం ఇపుడున్న పరిస్థితుల్లో అస్సలు కుదరే విషయం కాదు. ఒకప్పుడు ఒక హీరో సినిమా ఒకే సీజన్లో ఒకే రోజు విడుదలైన సందర్భాలున్నాయి. కానీ ఇప్పట్లో అలాంటి సీన్ చిరు విషయంలో రిపీట్ అవుతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా మెగా కాంపౌండ్‌లో ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ఓటీటీ డబ్బులు కావాలంటే ‘విశ్వంభర’ సంక్రాంతికి రావాల్సిందే..
భారీ ఓటీటీ డీల్‌ను నిలబెట్టుకోవాలంటే మాత్రం ‘విశ్వంభర’ సినిమాను కచ్చితంగా సంక్రాంతికి తేవాల్సిందే.. అదే జరిగితే చివరి నిమిషంలో ‘కాకా’ను సమ్మర్‌కు వాయిదా వేయక తప్పదు. అలా కాదని రిస్క్ చేస్తే.. చేతిలో ఉన్న విశ్వంభర ఓటిటి డీల్ చేజారినట్లే. మరి ఈ డైలమాలో మెగాస్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.