Amazon Great Indian Festival Sale 2026: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఆరోజు నుంచి భారీ ఆఫర్లు!
Amazon Great Indian Festival Sale 2026: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ మెగా సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు వంటి అనేక రకాల వస్తువులపై ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి.
Amazon Great Indian Festival Sale 2026:ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. అమెజాన్ ప్రకారం, కొన్ని ఉత్పత్తులు ఈ ఏడాదిలోనే అత్యంత తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. పండుగల సందర్భంగా కొత్త వస్తువులు కొనాలనుకునే వారికి ఈ సేల్‌లో అనేక ఆఫర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమర్లు ప్రత్యేక డిస్కౌంట్లను ఆశించవచ్చు.
ఎస్‌బీఐ కార్డులతో 10 శాతం డిస్కౌంట్
అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభించనుంది. అర్హత ఉన్న EMI లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తించవచ్చు. అయితే ప్రతి ఆఫర్‌కు ప్రత్యేక నిబంధనలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఆఫర్ వివరాలను తప్పకుండా చెక్ చేయాలి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు కూడా కొన్ని ప్రత్యేక డీల్స్‌లో అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. దీంతో ప్రైమ్ కస్టమర్లు మరిన్ని ఆఫర్లను పొందే అవకాశం ఉంది.
ఏఐ ఫీచర్లతో స్మార్ట్ షాపింగ్
ఈసారి అమెజాన్ షాపింగ్‌ను మరింత సులభంగా చేయడానికి ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటి ద్వారా ఉత్పత్తుల ధరలను పోల్చుకోవడం, గత ధరలను పరిశీలించడం, తమ అవసరాలకు సరిపోయే వస్తువులను గుర్తించడం వంటి పనులు చేయవచ్చు. అదే సమయంలో ‘బ్లాక్‌బస్టర్ డీల్స్’, ‘8 PM డీల్స్’, ‘ఎక్స్ఛేంజ్ మేళా’ వంటి ప్రత్యేక ఆఫర్లపై కూడా కస్టమర్లు దృష్టి పెట్టవచ్చు.
1.60 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు
పండుగ సీజన్‌లో ఆర్డర్లు పెరగనున్న నేపథ్యంలో అమెజాన్ తన డెలివరీ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది. 400 నగరాల్లో 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ సీజన్ కోసం 1.60 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలను కూడా కల్పించినట్లు సంస్థ తెలిపింది.
అంతేకాకుండా ‘అమెజాన్ నౌ’ సేవను మరో 100 నగరాలకు విస్తరించనుంది. వరంగల్, తిరుపతి, జలంధర్ వంటి నగరాల్లో కూడా ఈ సేవ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా కిరాణా, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, చిన్న ఎలక్ట్రానిక్స్ వంటి వాటిని వేగంగా డెలివరీ పొందే అవకాశం ఉంటుంది.
Also Read: తాపీ మేస్త్రీకి 'డాక్టరేట్.. కష్టాలను జయించి ఉస్మానియాలో Phd సాధించిన వలిగొంగ నరసింహ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి