SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amazon Layoffs: ఓ పక్క గ్రేట్ ఇండియా సేల్..మరో పక్క గ్రేట్ లేఆఫ్స్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోత!

Amazon Layoffs Hit Today: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా తన రిటైల్, 'స్టోర్స్' విభాగంలో వెయ్యికి పైగా ఉద్యోగులను తొలగించింది. కరోనా మహమ్మారి సమయంలో అవసరానికి మించి సిబ్బందిని నియమించుకోవడమే ప్రస్తుత లేఆఫ్‌లకు కారణమని కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పష్టం చేశారు. ఒకవైపు ఉద్యోగుల కోత విధిస్తున్నప్పటికీ, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాల కోసం ఏకంగా 220 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులకు అమెజాన్ సిద్ధమవుతోంది.

Written By Harish Darla
Published: Oct 08, 2026, 11:14 AM IST | Updated: Oct 08, 2026, 11:18 AM IST
Join

Amazon Layoffs Hit Today: ఈ - కామర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ మళ్లీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. భారత్, అమెరికా, యూకేలతో సహా పలు దేశాల్లోని రిటైల్ బృందాలు, ఈ - కామర్స్ వెబ్‌సైట్‌ను పర్యవేక్షించే 'స్టోర్స్' వ్యాపార విభాగానికి చెందిన వెయ్యి మందికి పైగా ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.

రానున్న రోజుల్లో మొత్తం 30,000 మంది ఉద్యోగులను తొలగించాలనే విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ తాజా కోతలు జరిగాయి. తమ ప్రాధాన్యతలను మెరుగ్గా చేరుకోవడానికే ఈ సర్దుబాట్లు చేసినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపినప్పటికీ, తొలగించిన వారి కచ్చితమైన సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు.

లేఆఫ్‌లకు ప్రధాన కారణాలు, నోటీసులు..
కరోనా సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై అధిక సంఖ్యలో ఆర్డర్లు ఇవ్వడంతో, ఆ తీవ్ర ఒత్తిడికి అనుగుణంగా అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడమే ప్రస్తుత లేఆఫ్‌లకు ప్రధాన కారణమని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు.

భారత్‌లో 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్, ప్రపంచవ్యాప్తంగా 'ప్రైమ్ బిగ్ డీల్ డేస్' ప్రారంభమైన సమయంలోనే మంగళవారం రోజున ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తొలగింపు సమాచారం అందించారు. దీంతో బాధితులు కంపెనీ అంతర్గత స్లాక్ ఛానల్‌లో సెవరెన్స్ ప్యాకేజీ, నోటీస్ పీరియడ్, ఇతర అవకాశాలపై చర్చించుకున్నారు.

ఏఐ పై దృష్టి, మారుతున్న టెక్ ధోరణి..
ఒకవైపు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నప్పటికీ, సాంకేతిక భవిష్యత్తు కోసం ఏఐ విభాగంలో డేటా సెంటర్లు, చిప్‌లు, మౌలిక సదుపాయాల కల్పన కొరకు 220 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి అమెజాన్ ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాకుండా, ఏడబ్ల్యూఎస్ (AWS), ఏఐ విభాగాల్లోని ఖాళీల భర్తీ కోసం గతంలో తొలగించిన కొందరు ఉద్యోగులను తిరిగి సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

మెటా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగ కోతలు విధిస్తూనే ఏఐ ప్రాజెక్టులపై భారీగా దృష్టి సారిస్తుండటం టెక్ పరిశ్రమలో మారుతున్న ప్రాధాన్యతలకు అద్దం పడుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES